Peddi Trailer 101 Million Views: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరో గా నటించిన ‘పెద్ది’ చిత్రం జూన్ 4 న విడుదల అవ్వబోతున్న సందర్భంగా నిన్న మేకర్స్ ముంబై లో భారీ ఈవెంట్ ని ఏర్పాటు చేసి అన్ని భాషల్లోనూ విడుదల చేశారు. ఈ ట్రైలర్ కి నెటిజెన్స్ నుండి డివైడ్ రెస్పాన్స్ వచ్చింది కానీ, సోషల్ మీడియా లో మాత్రం సెన్సేషనల్ వ్యూస్ ని సొంతం చేసుకుంది. రామ్ చరణ్ కి ఉన్నటువంటి గ్లోబల్ క్రేజ్ కారణంగా ఈ రేంజ్ వ్యూస్ వచ్చాయని అంటున్నారు విశ్లేషకులు. కేవలం యూట్యూబ్ లో మాత్రమే కాదు , ఇన్ స్టాగ్రామ్ , ట్విట్టర్ , ఫేస్ బుక్ ఇలా అన్ని యాప్స్ లోనూ ఈ చిత్రానికి రికార్డు స్థాయి వ్యూస్ వచ్చాయి. ఇలా అన్ని సోషల్ మీడియా నెట్ వర్క్స్ నుండి ఈ చిత్రానికి 101 మిలియన్ వ్యూస్ వచ్చాయట.
కేవలం రామ్ చరణ్ ఇన్ స్టాగ్రామ్ హ్యాండిల్ నుండి ఈ సినిమా ట్రైలర్ కి 20 మిల్లియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. అదే విధంగా యూట్యూబ్ లో ఈ ట్రైలర్ తెలుగు వెర్షన్ కి 38 మిలియన్ వ్యూస్ రాగా, హిందీ వెర్షన్ ట్రైలర్ కి 33 మిలియన్ వ్యూస్ వచ్చాయి. మిగిలిన వెర్షన్స్ కి కలిపి యూట్యూబ్ లోనే 81 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఇది సాధారణమైన విషయం కాదు. దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈ సినిమాకు ఆడియన్స్ లో ఎలాంటి క్రేజ్ ఉంది అనేది. వాళ్ళ అంచనాలకు తగ్గట్టుగా ఈ చిత్రం ట్రైలర్ ఉండుంటే వేరే లెవెల్ లో ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ పెరిగేవని , కానీ బ్యాడ్ లక్ అని అంటున్నారు రామ్ చరణ్ ఫ్యాన్స్. ఇకపోతే ఈ చిత్రానికి సంబంధించిన మూడవ పాటని ఈ నెల 22 న విడుదల చేయబోతున్నారు. భోపాల్ లో ఒక మ్యూజికల్ నైట్ ని నిర్వహించి , AR రెహమాన్ లైవ్ పెర్ఫార్మన్స్ ద్వారా ఈ సాంగ్ రిలీజ్ కాబోతుంది.
అదే విధంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని రెండు ప్రాంతాల్లో నిర్వహించాలని అనుకుంటున్నారు. ఈ సినిమా నేపథ్యం విజయనగరం జిల్లాలో ఉంటుంది కాబట్టి, మొదటి ప్రీ రిలీజ్ ఈవెంట్ ని జూన్ 2 న అక్కడే ప్లాన్ చేస్తున్నారు. అదే విధంగా రెండవ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని హైదరాబాద్ లో ఏర్పాటు చేయబోతున్నారు. ఈ రెండు ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో , ఎదో ఒక ఈవెంట్ లో రిలీజ్ ట్రైలర్ ని విడుదల చేస్తారట. అదే విధంగా హైదరాబాద్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా రాబోతున్నట్టు సమాచారం.
