Peddi Teaser
Peddi Teaser : ‘గేమ్ చేంజర్'(Game Changer Movie) తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global Star Ram Charan) నటిస్తున్న చిత్రం ‘పెద్ది'(Peddi Movie). బుచ్చి బాబు(Buchi Babu Sana) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని నిన్న మొన్నటి వరకు #RC16 అని పిలిచేవారు. నేడు ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఉదయం టైటిల్ ని , ఫస్ట్ లుక్ ని రివీల్ చేశారు. సోషల్ మీడియా మొత్తం ఈ ఫస్ట్ లుక్ కాక రేపింది. రామ్ చరణ్ హిస్టారికల్ కం బ్యాక్ లోడింగ్ అంటూ ఆయన అభిమానులు ఆనందం తో ట్వీట్స్ వేస్తున్నారు. దెబ్బలు తగిలేకొద్దీ రామ్ చరణ్ స్టామినా ఒకటికి పదింతలు ఎక్కువ అవుతుందని, కచ్చితంగా ‘పెద్ది’ సినిమాతో రామ్ చరణ్ పాన్ ఇండియా లెవెల్ లో చరిత్ర సృష్టిస్తాడని బలమైన నమ్మకం తో నేడు ఫస్ట్ లుక్ పోస్టర్ ని చూసిన తర్వాత చెప్తున్నారు అభిమానులు. అయితే ముందుగా నేడు టీజర్ ని విడుదల చేయాలనీ అనుకున్నారు.
Also Read : ‘నాయక్’ రీ రిలీజ్ కి డిజాస్టర్ రెస్పాన్స్..ఎంత గ్రాస్ వచ్చిందంటే!
కానీ AR రెహమాన్ నుండి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ స్కోర్ వర్క్ పెండింగ్ లో ఉండేలోపు కేవలం ఫస్ట్ లుక్ తో సరిపెట్టారు. ఇప్పుడు కాకపోయినా మరో రెండు రోజుల్లో ఉగాది వస్తుంది కదా, అప్పుడైనా ఈ టీజర్ ని విడుదల చేస్తారేమో అని అభిమానులు ఆశించారు. కానీ అది సాధ్యం అయ్యేలా లేదని అంటున్నారు. వాస్తవానికి ముందు ప్లాన్ చేసుకున్న షెడ్యూల్ ప్రకారం అయితే ఉదయం ఫస్ట్ లుక్, సాయంత్రం టీజర్ ని విడుదల చేయాలి. కానీ రెహమాన్ పూర్తి చేయాల్సిన పని ఇంకా బ్యాలన్స్ ఉంది. అందుకే విడుదల చేయలేకపోయారు. టీజర్ రెడీ గా ఉంది, కనీసం ఉగాదికి అయినా విడుదల చేయొచ్చు కదా అని అభిమానులు మూవీ టీం ని ట్యాగ్ చేసి అడుగుతున్నారు. కానీ మేకర్స్ అందుకు సిద్ధంగా లేనట్టు లేటెస్ట్ గా అందుతున్న సమాచారం. ఒకవేళ ఉగాదికి టీజర్ ని వదిలే ఉద్దేశ్యమే ఉంటే, నేడు ఫస్ట్ లుక్ పోస్టర్ మీదనే టీజర్ విడుదల తేదీని ప్రకటించేవారు.
కానీ అలాంటివేమీ చేయలేదు కాబట్టి ఉగాది కి టీజర్ లేనట్టే. ఒకవేళ మూవీ టీం ఫ్యాన్స్ కి సప్రైజ్ అన్నట్టు సడన్ గా ప్లాన్ చేస్తే మాత్రం చెప్పలేం.ఇదంతా పక్కన పెడితే ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది మార్చి 26 న విడుదల చేసే ప్లాన్ లో ఉన్నారని తెలుస్తుంది. వాస్తవానికి ఈ ఏడాదిలోనే విడుదల చేయాలనీ అనుకున్నారు కానీ, వర్క్ పూర్తి అయ్యేలా కనిపించడం లేదు. బుచ్చి బాబు సుకుమార్ స్కూల్ నుండి వచ్చిన డైరెక్టర్. ఏ షాట్ కూడా అతనికి ఒక పట్టాన నచ్చదు. కాబట్టి రీ షూట్స్ జరిగే అవకాశాలు ఉన్నాయి. అంతే కాకుండా రామ్ చరణ్ కూడా ఈ సినిమా విషయం లో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. ప్రతీ సన్నివేశాన్ని ఆయన క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాడట. అందుకే వచ్చే ఏడాది విడుదల చేయాలని అనుకుంటున్నారు.
Also Read : ‘పుష్ప’ లుక్ ని తలపించిన రామ్ చరణ్ ‘పెద్ది’ ఫస్ట్ లుక్ పోస్టర్!