Peddi : ఇండియన్ సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు సాగుతుంది. యంగ్ డైరెక్టర్స్ అందరూ మంచి కథలను ఎంచుకొని సినిమాలుగా చేస్తూ వాళ్ళను వాళ్ళు స్టార్ డైరెక్టర్లుగా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక ఇలాంటి సందర్భంలోనే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపు తిప్పుకుంటున్న స్టార్ హీరోలందరు వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎలివేట్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది…ఇక ఇప్పుడు బుచ్చిబాబు (Buchhi babu) లాంటి దర్శకుడు సైతం తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక రామ్ చరణ్ తో చేస్తున్న పెద్ది (Peddi) సినిమా భారీ సక్సెస్ ని సాధిస్తుంది అంటూ ఆయన చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. రీసెంట్ గా ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ ని రిలీజ్ చేశారు. అందులో హీరో క్యారెక్టరైజేషన్ తో పాటు ఈ సినిమాలో మెయిన్ స్టోరీ ఏంటి అనేది రివిల్ చేశారు. ముఖ్యంగా ఈ సినిమా క్రికెట్ ను బేస్ చేసుకొని ఉంటుందని ఈ టీజర్ లో మనకు చాలా స్పష్టంగా తెలియజేశారు. ఈ మూవీలో రామ్ చరణ్ ఒక గల్లీ క్రికెటర్ గా కనిపించబోతున్నాడు అనేది చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఇంటర్వెల్ బ్యాంగ్ మాత్రం చాలా అద్భుతంగా ఉండబోతుందట. అంటే హీరోయిన్ మీద క్రికెట్ మ్యాచ్ పెట్టి ఆడతారట. ఆ మ్యాచ్ ని హీరో ఎలా గెలిపించుకున్నాడు.
Also Read : ‘పెద్ది’ పై రామ్ గోపాల్ వర్మ వైరల్ ట్వీట్..కౌంటర్ ఇచ్చిన డైరెక్టర్!
మ్యాచ్ గెలిస్తేనే హీరోయిన్ తనకు దక్కుతుంది అనుకున్న సమయంలో ఆ ఒక మ్యాచ్ గెలిచాడా? లేదా అనేదానితో ఇంటర్వెల్ కట్ అయితే వేస్తారట. ఇది చాలా హై వోల్టేజ్ తో ఉంటుందని సెకండాఫ్ మొత్తం దీనికి లీడ్ గా మారబోతుందని బుచ్చిబాబు టీం నుంచి కొన్ని వార్తలైతే వస్తున్నాయి.
మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో రామ్ చరణ్ మరోసారి తనను తాను స్టార్ హీరోగా ఎలివేట్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది. గ్లోబల్ స్టార్ గా అవతరించిన రామ్ చరణ్ ఈ మధ్య పెద్దగా సక్సెస్ లను అయితే సాధించలేకపోతున్నాడు.
‘త్రిబుల్ ఆర్’ (RRR) సినిమా తర్వాత చేసిన ఆచార్య (Acharya), గేమ్ చేంజర్ (Game Changer) రెండు సినిమాలతో డిజాస్టర్ లను మూటగట్టుకున్న ఆయన ఈ సినిమాతో భారీ సక్సెస్ ని సాధించి తిరిగి తన మార్కెట్ తను పొందాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
Also Read : పెద్ది మూవీకి ఏ ఆర్ రెహమాన్ మ్యూజిక్ మైనస్ కానుందా.?