Peddi OTT: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలై బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ ని సొంతం చేసుకొని బాక్స్ ఆఫీస్ వద్ద 350 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి, వరుస ఫ్లాప్స్ లో ఉన్న రామ్ చరణ్ ని సక్సెస్ ట్రాక్ లోకి తీసుకొచ్చింది. కొన్ని సినిమాలు కంటెంట్ వల్ల ఆడుతాయి , కొన్ని సినిమాలు డైరెక్టర్ క్రియేటివిటీ వల్ల ఆడుతాయి , కానీ కేవలం హీరో పెర్ఫార్మన్స్ తో ఆడే సినిమాలు కొన్ని ఉంటాయి , అలాంటి చిత్రాల్లో ఒకటి ‘పెద్ది’. డైరెక్టర్ గా బుచ్చి బాబు ఈ సినిమా ని తీసిన విధానం పై సోషల్ మీడియా లో అనేక ట్రోల్స్ వచ్చాయి , హీరోయిన్ ని ఆయన చూపించిన తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు , పెద్ద వివాదం కూడా అయ్యింది.
అయినప్పటికీ కూడా ఇవన్నీ రామ్ చరణ్ పెర్ఫార్మన్స్ ముందు కొట్టుకొని పోయాయి. ఆడియన్స్ ఆయన ఈ చిత్రం కోసం పడిన కష్టానికి మంచి ఫలితమే ఇచ్చారు. అయితే ఓటీటీ లో మాత్రం ఈ చిత్రానికి భిన్నమైన రెస్పాన్స్ వచ్చింది. ఇతర భాషలకు సంబంధించిన వాళ్ళు ఈ చిత్రం లోని కొన్ని సన్నివేశాలను సోషల్ మీడియా లో పోస్ట్ చేసి ఒక రేంజ్ లో ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. ఆ ట్రోలింగ్ కి భీభత్సమైన రెస్పాన్స్ కూడా వచ్చింది. ఇన్ స్టాగ్రామ్ లో పాపులర్ మీమ్ పేజీలు కూడా పెద్ది పై విమర్శలు చేశాయి. ఇలా అత్యధిక ట్రోల్ కి గురైన ఈ చిత్రానికి వ్యూస్ కూడా మొదటి వారం లో అంతంత మాత్రం గానే వచ్చాయి. నెట్ ఫ్లిక్స్ వదిలిన గణాంకాల ప్రకారం చూస్తే , ఈ చిత్రానికి మొదటి వారంలో కేవలం 1.9 మిలియన్ వ్యూస్ మాత్రమే వచ్చాయి.
ఇటీవల కాలం లో ఒక పెద్ద హీరో సినిమాకు ఇంత తక్కువ వ్యూస్ రావడం ‘పెద్ది’ చిత్రానికే జరిగింది. అయితే హిందీ వెర్షన్ విడుదల లేదు కాబట్టి తక్కువ వ్యూస్ వచ్చాయని అంటున్నారు విశ్లేషకులు. నెట్ ఫ్లిక్స్ లో అత్యధిక శాతం హిందీ వెర్షన్ నుండే వ్యూస్ వస్తాయట. హిందీ వెర్షన్ లేకపోతే వ్యూస్ రావడం కష్టమని అంటున్నారు. కానీ గతం లో ‘దేవర’ చిత్రానికి హిందీ వెర్షన్ చాలా ఆలస్యం గా విడుదలైంది. అయినప్పటికీ కూడా ఆ చిత్రానికి మొదటి వారం 2.2 మిలియన్ వ్యూస్ వచ్చాయి. పెద్ది చిత్రానికి కూడా అదే రేంజ్ రెస్పాన్స్ వచ్చి ఉండుంటే బాగుండేది అని కొందరి వాదన. మరి హిందీ వెర్షన్ విడుదల అయ్యాక , పెద్ది రేంజ్ ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుందో చూడాలి. ప్రస్తుతానికి నెట్ ఫ్లిక్స్ లో ఈ చిత్రం 5 వ స్థానం లో ట్రెండ్ అవుతోంది.
