Peddi Movie Song Postponed: రామ్ చరణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న ‘పెద్ది’ చిత్రం నుండి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సోషల్ మీడియా మొత్తం ఊగిపోవడం అనేది గత కొంత కాలంగా మనం చూస్తూనే ఉన్నాం. ఈమధ్య కాలం లో ఒక స్టార్ హీరో సినిమాకు ఇంత హైప్ రావడం అనేది ఓజీ తర్వాత పెద్ది కే చూస్తున్నారు ట్రేడ్ పండితులు. ఇప్పటి వరకు ఈ చిత్రం నుండి వచ్చిన ప్రతీ కంటెంట్ ఒక రేంజ్ లో పేలింది. ముఖ్యంగా ‘చికిరి చికిరి’ పాట అయితే గ్లోబల్ వైడ్ గా ఒక ప్రభంజనం సృష్టించింది. చిన్న పిల్లల దగ్గర నుండి పెద్ద వాళ్ళ వరకు ప్రతీ ఒక్కరు ఈ పాటకు చిందులేశారు. అలాంటి పాట తర్వాత ఈ చిత్రం నుండి విడుదల అవ్వబోయే రెండవ పాట ఏ రేంజ్ లో ఉంటుందో అని అభిమానులతో పాటు మూవీ లవర్స్ కూడా ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.
రెండవ పాట ‘రయ్.. రయ్’ అనే లిరిక్ తో మొదలు అవుతుందట. ఈ పాటకు కూడా జానీ మాస్టర్ అద్భుతమైన కోరియోగ్రాఫీ అందించాడు. అయితే ఈ పాటని వాలంటైన్స్ డే సందర్బంగా ఫిబ్రవరి 14 న విడుదల చేస్తారని అంతా అనుకున్నారు. కానీ ఇప్పట్లో ఈ పాట విడుదల అయ్యే అవకాశలు లేవట. మార్చి మొదటి వారం లో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. కారణం ఏంటో తెలియదు కానీ, బాబాయ్ పవన్ కళ్యాణ్ కోసం అబ్బాయ్ చేసిన త్యాగం ఇది అంటూ కామెంట్స్ చేస్తున్నారు రామ్ చరణ్ ఫ్యాన్స్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ లోని రెండవ పాటని ఫిబ్రవరి 15 నుండి 20 లోపు విడుదల చేయబోతున్నారని, బాబాయ్ సినిమాతో క్లాష్ ని నిరాకరించడం కోసమే చరణ్ ఈ పెద్ది పాటని వాయుదా వేయించి ఉంటాడని అంటున్నారు రామ్ చరణ్ ఫ్యాన్స్.
ఇలా కెరీర్ మొత్తం నాన్న, బాబాయ్ కోసం త్యాగాలు చేసుకుంటూ వెళ్ళిపో, అభిమానుల ఎమోషన్స్ నీకు అసలు అక్కర్లేదు. ఈ మాత్రం దానికి సినిమాలు చేస్తూ మమ్మల్ని టార్చర్ చేయడం ఎందుకు, రిటైర్మెంట్ ఇచ్చేయ్ అంటూ రామ్ చరణ్ ని ట్యాగ్ చేసి తమ ఆవేశన్ని వ్యక్తం చేస్తున్నారు చరణ్ ఫ్యాన్స్. అయితే ఉస్తాద్ భగత్ సింగ్ కోసం వాయిదా వేయలేదని, పాటకు సంబందించిన పనులు పూర్తి అవ్వకపోవడం వల్లే వాయిదా వేశారని రామ్ చరణ్ సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి.