Peddi Movie Story: రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో ‘పెద్ది’ సినిమా జూన్ 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటివరకు ఈ సినిమా మీద భారీ అంచనాలైతే ఉన్నాయి. మరి ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమాని బుచ్చిబాబు తెరకెక్కించాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. పెద్ది సినిమా విషయంలో రామ్ చరణ్ చాలా వరకు కేర్ ఫుట్ గా వ్యవహరించాడు. అతని క్యారెక్టర్ లోని వేరియేషన్స్ ను చూపించడానికి అహర్నిశలు కష్టపడ్డాడు అంటూ సినిమా యూనిట్ నుంచి కొన్ని వార్తలైతే బయటికి వస్తున్నాయి. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా సక్సెస్ అనేది రామ్ చరణ్ కెరియర్ కి చాలా కీలకంగా మారబోతుంది. గత సంవత్సరం శంకర్ డైరెక్షన్లో చేసిన గేమ్ చేంజర్ సినిమా భారీ డిజాస్టర్ ని మూటగట్టుకోవడంతో ఆయన ఇప్పుడు చేయబోయే సినిమాతో తనను తాను స్టార్ హీరోగా ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది.
ఇక ఏది ఏమైనా కూడా ఇకమీదట ఆయన చేయబోతున్న సినిమాల విషయంలో చాలా కేర్ఫుల్ గా వ్యవహరిస్తూనే భారీ సక్సెస్ లను సాధించాల్సిన అవసరం కూడా ఉంది. ఒకవేళ ఈ సినిమాల విషయంలో పొరపాటు జరిగితే మాత్రం రామ్ చరణ్ భారీ మూల్యాన్ని చెల్లించుకోక తప్పదు…
ఇక ఇదిలా ఉంటే పెద్ది సినిమాలో హీరో ఒక ఊరి కోసం కష్టపడే కుర్రాడిగా కనిపించాడు. ఇక ఇలాంటి క్రమంలోనే శివరాజ్ కుమార్ కుస్తీ ఫైట్లను నిర్వహిస్తూ ఆ ఊరికి సంబంధించిన విషయాల్లో ఎవరు పై చేయి సాధించాలి అనేదాన్ని డిసైడ్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. శివరాజ్ కుమార్ క్యారెక్టర్ ని కూడా ట్రైలర్ లో చాలా బాగా ఎస్టాబ్లిష్ చేశారు.
ఆయన పాత్ర చనిపోతుందా? లేదా చివరి వరకు అలానే ఉంటాడా? అనే విషయంలో సరైన క్లారిటీ లేదు కానీ మొత్తానికైతే కుస్తీ పోటీల్లో గ్యాంబ్లింగ్ చేయడానికి అతన్ని కొంతమంది కావాలనే హతమారుస్తారనే విషయమైతే బయటికి వచ్చింది. ఇక రామ్ చరణ్ వాళ్ళందరిని ఎలా మట్టు పెట్టాడు. రామ్ చరణ్ కి శివ రాజ్ కుమార్ క్యారెక్టర్ కి మధ్య ఉన్న ఏటి అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే…
