Peddi Movie Release Date: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global Star Ram Charan) నటిస్తున్న ‘పెద్ది'(Peddi Movie) చిత్రం పై రోజురోజుకి అంచనాలు తారా స్థాయిలో పెరిగిపోతున్నాయి. ఇప్పటి వరకు ఈ చిత్రం నుండి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ అలాంటిది మరీ. గ్లింప్స్ వీడియో నే పెద్ద సిక్సర్ అనుకుంటే, ‘చికిరి చికిరి’ పాట మరో భారీ సిక్సర్ . కేవలం ఇండియన్ ఆడియన్స్ మాత్రమే కాదు, ఇతర దేశాల్లో కూడా ఈ పాట వైరల్ అయిపోయింది. ఇంత పెద్ద హిట్ అవుతుందని అభిమానులు కూడా ఊహించి ఉండరు. ఎప్పుడెప్పుడు ఈ సినిమాని థియేటర్స్ లో చూద్దామా అనే ఆత్రుతని జనాల్లో కలిగించింది ఈ చిత్రం. అన్నీ అనుకున్నట్టు కుదిరితే ఈ చిత్రాన్ని మార్చి 27న రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా గ్రాండ్ గా విడుదల చెయ్యాలని అనుకున్నారు. కానీ అప్పటికి సినిమా రెడీ అవ్వడం అసాధ్యమని తెలుస్తోంది.
మేకర్స్ అయితే ఈ చిత్రాన్ని వాయిదా వెయ్యాలని నిర్ణయించుకున్నారు. ఆ విషయాన్నీ బయ్యర్స్ కి కూడా చెప్పేసారు, అభిమానులకు అధికారికంగా తెలియజేయయడమే బ్యాలన్స్. వచ్చే వారం లోపు అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. వాయిదా అవ్వడానికి ప్రధాన కారణం షూటింగ్ చాలా వరకు బ్యాలన్స్ ఉండడమే. రీసెంట్ గానే ఈ చిత్రానికి సంబంధించిన ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ షెడ్యూల్ మొదలైంది. అందుకోసం రామ్ చరణ్ తన బాడీ ని కూడా బాగా తయారు చేసుకున్నాడు.ఈ షెడ్యూల్ పూర్తి అయ్యి, మిగిలిన ప్యాచ్ వర్క్ ని కూడా పూర్తి చేసుకొని, ఫైనల్లీ కాపీ నిర్మాత చేతుల్లోకి వచ్చేలోపు మార్చి నెలాఖరు వరకు అవుతుందట; ఇంత సమయం పట్టడానికి కారణం డైరెక్టర్ బుచ్చి బాబు నే అని తెలుస్తుంది. గురువు సుకుమార్ లాగానే, శిష్యుడు బుచ్చి బాబు కూడా ఒక్కో సన్నివేశానికి రెండు మూడు వెర్షన్స్ టీజీరకెక్కించి, ది బెస్ట్ అనిపించింది తీసుకుంటున్నాడట. అందుకే ఎక్కువ సమయం అయ్యిందని అంటున్నారు.
ఇకపోతే ఈ చిత్రానికి సంబంధించిన రెండవ పాటని వచ్చే నెల మొదటి వారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. పాట సిద్దంగానే ఉంది, ప్రస్తుతం లిరికల్ వీడియో సాంగ్ మేకింగ్ జరుగుతుంది, అది పూర్తి అవ్వగానే ఈ రెండవ పాటకు సంబంధించిన అప్డేట్ ని అధికారికంగా ప్రకటించబోతున్నారు మేకర్స్. ఇది ‘చికిరి చికిరి’ కంటే పెద్ద హిట్ అవుతుందని అంటున్నారు. ఈ పాటకు కూడా జానీ మాస్టర్ నే కొరియోగ్రఫీ చేశాడట. సినిమాలో అన్ని పాటలకు జానీ మాస్టర్ నే కొరియోగ్రఫీ చేసినట్టు తెలుస్తోంది. ఇకపోతే ఈ చిత్రాన్ని మే 1న విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారట మేకర్స్. త్వరలోనే దీనిపై కూడా నిర్ణయం తీసుకోనున్నారు.