Peddi Movie Release Date Change Impact: ఒక సినిమా అని సక్సెస్ ఫుల్ గా నిలపడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని ఇందులో 24 క్రాఫ్ట్ వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉంటారు. కాబట్టి ఏ ఒక్కరి పని సక్రమంగా జరగకపోయిన కూడా సినిమా రిజల్ట్ తేడా కొట్టే అవకాశం ఉంది. ఇక ఇలాంటి క్రమంలోనే దర్శకుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని సినిమాలను తెరకెక్కించాల్సిన అవసరమైతే ఉంది. ప్రతి క్రాఫ్ట్ నుంచి వాళ్లు అనుకున్న ఔట్ పుట్ ను తీసుకురావడానికి చాలా రకాల ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇవన్నీ తట్టుకొని నిలబడ్డ వాళ్ళు మాత్రమే టాప్ డైరెక్టర్ గాఎదుగుతారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు డైరెక్షన్ లో వస్తున్న ‘పెద్ది’ సినిమా మొదట మార్చి 26వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తుందంటూ అనౌన్స్ చేశారు. కానీ ఆ తేదీ వరకు ఇంకా సినిమా షూటింగ్ కూడా పూర్తి కాకపోవడంతో ఏప్రిల్ 30వ తేదీన ఈ సినిమాను ప్రేక్షకులను ముందుకు రాబోతుందనే వార్తలు కూడా వచ్చాయి. ఇక మరి ఈ క్రమంలోనే ఈ సినిమాను జూన్ 26వ తేదీకి పోస్ట్ పోన్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమా నుండి అఫిషియల్ అనౌన్స్మెంట్ రాలేదు.
కానీ అదే జరిగితే మాత్రం పెద్ది సినిమా చాలావరకు నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే జూన్ లో పిల్లలకు స్కూల్స్ ఓపెన్ అవుతాయి. అలాగే కొన్ని పండుగలు కూడా వస్తాయి ఇక దానికి తోడుగా వర్షాకాలం… ఒకవేళ వర్షాలు ఎక్కువగా కురిసిన కూడా అవి సినిమాల మీద ఎక్కువ ఎఫెక్ట్ ను చూపించవచ్చు.
మొత్తానికైతే ఈ మూడు కారణాల చేత పెద్ది సినిమాకి భారీ ఇబ్బంది ఎదురయ్యే అవకాశాలైతే ఉన్నాయి. ఇక దానికి తోడుగా ఇరాన్ – ఇజ్రాయిల్ మధ్య యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధం కారణంగా పెట్రోల్, గ్యాస్ దొరక్కకపోవడం లాంటిది ఏదైనా జరిగితే మాత్రం సినిమా మీద మరింత ఇంపాక్ట్ పడే అవకాశాలున్నాయి. ఇక థియేటర్ కి వచ్చే వాళ్ళు సైతం కరువైపోతారు…
నిజానికి ఏప్రిల్ 30 వ తేదీ ప్రతి ఒక్కరికి అనుకూలంగా ఉంటుంది. అందరికి హాలిడేస్ ఉంటాయి. కాబట్టి కుటుంబ సభ్యులందరు కలిసి ఈ సినిమాని చూడడానికి చాలా అనుకూలంగా ఉండేది. కానీ ఇప్పుడు పోస్ట్ పోన్ అవ్వడం వల్ల ఈ సినిమాను పట్టించుకునే వాళ్ళు కూడా కరువైపోతారనే చెప్పాలి…