Peddi Movie Rejected Bollywood Actor: తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్లు తమ టాలెంట్ ని చూపిస్తూ టాప్ డైరెక్టర్లుగా ఎదగాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇక అందులో భాగంగానే సుకుమార్ శిష్యుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన బుచ్చిబాబు సైతం ‘ఉప్పెన’ సినిమాతో తన మార్కును చూపించాడు. ప్రస్తుతం రామ్ చరణ్ తో చేస్తున్న ‘పెద్ది’ సినిమాతో మరోసారి తనను తాను స్టార్ట్ డైరెక్టర్ గా ఎలివేట్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు. తను అనుకున్నట్టుగానే ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు తద్వారా ఆయనకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ అవుతుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…
Also Read: 15 రోజుల్లో 1500 కోట్లు కొల్లగొట్టిన ‘ధురంధర్ 2’.. ఇక మిగిలిన రికార్డు టార్గెట్స్ ఇవే..
అయితే బుచ్చిబాబు మొదట పెద్ది సినిమాను జూనియర్ ఎన్టీఆర్ తో చేయాలనుకున్నాడు. కానీ ఎన్టీఆర్ ఈ సినిమాని రిజెక్ట్ చేశాడు ఆ తర్వాత ఒక బాలీవుడ్ హీరో తో కూడా ఈ సినిమా చేయడానికి బుచ్చిబాబు సన్నాహాలు చేశారట. కానీ ఆ హీరోకి ఈ కథ నచ్చలేదట.. ఇంతకీ ఆ హీరో ఎవరంటే రన్బీర్ కపూర్ గా తెలుస్తుంది.
మొత్తానికైతే కొన్ని మార్పులు చేర్పులు చేసి సుకుమార్ రామ్ చరణ్ దగ్గరికి ఈ కథనైతే తీసుకువచ్చాడు. ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుందంటూ వార్తలైతే వస్తున్నాయి. ఇక రీసెంట్ గా రామ్ చరణ్ బాడీ బిల్డర్ల తన బాడీని బిల్డ్ చేసిన ఒక గ్లింప్స్ రిలీజ్ అయింది. అది నెక్స్ట్ లెవెల్లో ఉంది. ప్రతి ప్రేక్షకుడిని మెప్పిస్తుంది. ఇక ఈ సినిమా మీద హైప్ విపరీతంగా పెరిగిపోయింది. ఇక దానికి తగ్గట్టుగానే ఈ సినిమా భారీ సక్సెస్ ని సాధిస్తుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…
ఇక ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సినిమాలు చేసిన రాని గుర్తింపు రామ్ చరణ్ కి ఈ సినిమాతో వస్తుంది అనే ఒక కాన్ఫిడెంట్ తో ఉన్నాడు. గత సంవత్సరం ఆయన చేసిన గేమ్ చేంజర్ సినిమా ఆశించిన విజయాన్ని సాధించకపోవడంతో కొంతవరకు డీలా పడిపోయాడు… ఇక ఇప్పటికైనా తన స్టామినాను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది…
