Homeఎంటర్టైన్మెంట్Peddi movie interval scene: పెద్ది సినిమాలో ఇంటర్వెల్ సీన్ లో కనిపించనున్న స్టార్ హీరో.....

Peddi movie interval scene: పెద్ది సినిమాలో ఇంటర్వెల్ సీన్ లో కనిపించనున్న స్టార్ హీరో.. రచ్చ రచ్చే..

Peddi movie interval scene: సినిమా ఇండస్ట్రీలో విపరీతమైన పోటీ ఉంటుంది. ఒక హీరో సూపర్ సక్సెస్ ని సాధిస్తే మరొక హీరో అంతకుమించిన సూపర్ హిట్ దక్కించుకోవాల్సిన అవసరమైతే ఉంటుంది. లేకపోతే వాళ్ళ మార్కెట్ ని కోల్పోవాల్సిన పరిస్థితి కూడా రావచ్చు. ఇక ఇలాంటి క్రమంలోనే వాళ్ళు చేస్తున్న సినిమాల విషయంలో చాలా క్లారిటీని మెయింటైన్ చేస్తూనే ప్రేక్షకులు తమ నుంచి ఎలాంటి సినిమాని కోరుకుంటున్నారు వాళ్లను ఎలాంటి సినిమాతో మెప్పించాలి అనే విధంగా ఆలోచనలు చేయాలి. దానిలో ఏమాత్రం లోపం ఉన్నా కూడా సినిమాలు ఫ్లాప్ అవుతుంటాయి. ఇక ఇలాంటి క్రమంలోనే రామ్ చరణ్ సైతం ప్రస్తుతం డిఫరెంట్ తరహా సినిమాలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఆయన బూచి బాబు డైరెక్షన్లో ‘పెద్ది’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో ఆయన భారీ సక్సెస్ ని సాధిస్తాడనే కాన్ఫిడెంట్ ను వ్యక్తం చేస్తున్నాడు.

ఇక ఇప్పటికే ఈ సినిమా మీద భారీ అంచనాలైతే ఉన్నాయి. ఇక దానికి తగ్గట్టుగానే బుచ్చిబాబు సైతం రోజురోజుకి ఈ సినిమాల మీద హైప్ ను పెంచేస్తున్నాడు. రీసెంట్ గా రామ్ చరణ్ నుంచి వచ్చిన గ్లింప్స్ విపరీతంగా ఆకట్టుకుంది…ఇక ఈ సినిమా ఇంటర్వెల్ ఎపిసోడ్లో ఒక మ్యాజిక్ అయితే చేయబోతున్నట్టుగా తెలుస్తుంది.

Also Read: నాయక్ సినిమాలో రామ్ చరణ్ డూప్ గా నటించిన ఆ స్టార్ యాక్టర్…

రామ్ చరణ్ కి ఏం చేయాలో తెలియని ఒక ప్రాబ్లం ఎదురైనప్పుడు చిరంజీవి వచ్చి తనకి హెల్ప్ చేసి వెళ్ళిపోతాడట. స్పోర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా భారీ సక్సెస్ ని సాధిస్తుంది. తద్వారా రామ్ చరణ్ ఈ సినిమాతో ఎలా హీరోగా మారబోతున్నాడనేది తెలియాల్సి ఉంది… ఇక ఈ సినిమాలో చిరంజీవి వచ్చి రామ్ చరణ్ ను సేవ్ చేయడంతో అప్పుడు ఇంటర్వెల్ పడబోతున్నట్టుగా తెలుస్తుంది.

ఇక ఏది ఏమైనా కూడా చిరంజీవి చేస్తున్న ఈ సినిమా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని మెప్పించగలుగుతుందనే నమ్మకం అతని అభిమానులకైతే ఉంది. రామ్ చరణ్ నుంచి ఇంతకుముందు వచ్చిన గేమ్ చేంజర్ సినిమా తీవ్రంగా నిరాశ పరచడంతో ఇప్పుడు ఆయన ఎలాగైనా సరే భారీ సక్సెస్ ను తన ఖాతాలో వేసుకోవాల్సిన అవసరమైతే ఉంది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version