Homeఎంటర్టైన్మెంట్Ram Charan Naayak: నాయక్ సినిమాలో రామ్ చరణ్ డూప్ గా నటించిన ఆ స్టార్...

Ram Charan Naayak: నాయక్ సినిమాలో రామ్ చరణ్ డూప్ గా నటించిన ఆ స్టార్ యాక్టర్…

Ram Charan Naayak: రామ్ చరణ్ హీరోగా వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ‘నాయక్’ సినిమా భారీ సక్సెస్ ని సాధించింది. కమర్షియల్ గా ఈ మూవీ భారీ లాభాలను తీసుకొచ్చి పెట్టడంతో రామ్ చరణ్ ఖాతాలో అప్పటివరకు ఉన్న సక్సెస్ లను మించి ఈ సినిమా భారీ విజయాన్ని సాధించిందనే వార్తలు వినిపించాయి. మొత్తానికైతే రామ్ చరణ్ తన కెరియర్లో చేసిన చాలా సినిమాలు సక్సెస్ లు సూపర్ సక్సెస్ లను సాధించాయి. ఇక ఈ క్రమంలోనే రామ్ చరణ్ డిఫరెంట్ సినిమాల వైపు అడుగులు వేశాడు. నాయక్ సినిమాలో ఆయన ద్విపాత్రాభినయం చేశాడు. అతను ఇప్పటివరకు డ్యూయల్ రోల్లో నటించిన సినిమా కూడా అది ఒకటే కావడం విశేషం… హీరోలు డ్యూయల్ రోల్లో నటించినప్పుడు సింగిల్ క్యారెక్టర్ ఉంటే హీరో నటిస్తాడు. కానీ ఒకే ఫ్రేమ్లో డ్యూయల్ రోల్ చేస్తున్న ఇద్దరు హీరోలు నటించాల్సి వచ్చినప్పుడు మాత్రం ఒక క్యారెక్టర్ లో హీరో నటిస్తే అతనికి డూప్ గా మారెవరైనా నటుడు ఉండాల్సిన అవసరం ఉంటుంది.

ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు కొంతమంది సపరేట్ గా హీరోకు డూపులను తీసుకొచ్చుకుంటే మరి కొంతమంది దర్శకులు మాత్రం తన డైరెక్షన్ టీమ్ లో ఉన్న వాళ్ళను హీరోలకు డూప్ గా వాడుతుంటారు. ఇక ఏది ఏమైన కూడా రామ్ చరణ్ నాయక్ సినిమాలో నటించినప్పుడు ఒక క్యారెక్టర్ లో రామ్ చరణ్ నటిస్తే అతని డూప్ గా సాగర్ అనే కుర్రాడు నటించాడట.

ఆయనను చూడటానికి కొంచెం రామ్ చరణ్ లాగే ఉండడంతో అతనైతేనే బాగుంటుందని దర్శకుడు వివి వినాయక్ అనుకోని రామ్ చరణ్ కి డూప్ గా తనను వాడినట్టుగా తెలుస్తుంది…ఇక హీరోలకు డూప్ గా చేసే వాళ్లకు చాలా తక్కువ జీతం ఇస్తారు. కానీ హీరోలు మాత్రం కోట్లలో రెమ్యూనరేషన్ తీసుకుంటారు. గత కొన్ని రోజులుగా హీరోల డూప్ లు గ్రేట్ అంటూ కొన్ని కామెంట్లు వస్తున్నాయి…

ఇక ఏది ఏమైనా హీరోలు డూప్ లను ఎందుకు వాడుకుంటారు అంటే ఏదైనా రిస్కీ షాట్ తీసేటప్పుడు హీరోలకు ఏదైనా గాయం అయితే సినిమా షూటింగ్ లేట్ అవుతుంటుంది. దానివల్ల రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి హీరోలను చాలా సున్నితంగా కాపాడుకుంటూ వాళ్లతో అలాంటి రిస్కీ షాట్స్ చేయించడానికి దర్శక నిర్మాతలు ఇంట్రెస్ట్ చూపించరు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version