Homeబిజినెస్Tata Tiago EV mileage range: EV కార్లు కొనేవారికి గుడ్ న్యూస్.. Tiago మైలేజ్...

Tata Tiago EV mileage range: EV కార్లు కొనేవారికి గుడ్ న్యూస్.. Tiago మైలేజ్ తెలిస్తే విడిచిపెట్టరు..

Tata Tiago EV mileage range: మధ్యతరగతి ప్రజల కోసం హ్యాచ్ బ్యాక్ కార్లు ఎప్పటికీ అందుబాటులోనే ఉంటాయి. ఈ సెగ్మెంట్లో మారుతి సుజుకి కంపెనీకి చెందిన వ్యాగన్ఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటారు. అయితే దీనికి గట్టి పోటీ ఇస్తూ టాటా టియాగో నిలిచింది. దేశంలో టాటా కంపెనీని టాప్ లెవల్ లో నిలబెట్టేందుకు టియాగో కారు ఎంతో కృషి చేసింది. ఈ కారు ఇప్పుడు లేటెస్ట్ డిజైన్ తో మార్కెట్లోకి రాబోతుంది. గతంలో ఉన్న కారు కంటే ఎక్స్టీరియర్ డిజైన్తో పాటు కొత్త టెక్నాలజీని ఇందులో అమర్చారు. అలాగే ఇంజన్లో కూడా కొద్దిగా మార్పులు చేసినట్లు తెలుస్తుంది. ఇప్పటికే టియాగో కారు ఉన్న వారితోపాటు కొత్త కారు కొనాలని అనుకునే వారికి ఈ కారు బెస్ట్ ఎంపిక అని అంటున్నారు. ఇందులో ఎలాంటి ఫీచర్లు? ఇంజన్ ఉంటుందో చూద్దాం..

హ్యాచ్ బ్యాక్ సెగ్మెంట్లో టాటా కంపెనీకి చెందిన టియాగో ది బెస్ట్ సెల్లర్ కారుగా నిలిచింది. అయితే అప్డేట్ అవుతున్న ఈ కొత్త కారులో 1.2 లీటర్ రేవో ట్రాన్ ట్విన్ ఇంజన్ ఉండనుంది. ఈ ఇంజన్ 86 పవర్ తో పాటు 113 NM టార్క్ ను రిలీజ్ చేస్తుంది. ఈ ఇంజన్ 5 స్పీడ్ మాన్యువల్ తోపాటు ఆటోమేటిక్ గేర్ బాక్స్ తో పనిచేస్తుంది. ఇందులో CNG ఆప్షన్ కూడా ఉండడంతో దీనిని రెండు రకాలుగా వాడుకునే అవకాశం ఉంటుంది. CNG ఇంజన్ పై ఈ కారు 28.06 కిలోమీటర్ల మైలేజ్ అందిస్తుంది.

Also Read: Maruti Suzuki కార్లు కొనేవారికి గుడ్ న్యూస్.. త్వరలోనే బెస్ట్ ఎలక్ట్రిక్ కారు.. ధర బడ్జెట్ లోనే..

ఈ కారు ఎక్స్టీరియర్ డిజైన్ విషయానికి వస్తే.. ఆకట్టుకునే విధంగా హెడ్ లాంప్స్ ఉండనున్నాయి. అల్లాయి వీల్స్ తో పాటు స్పోర్ట్స్ కారు లుక్ ఇచ్చే విధంగా బంపర్ కొత్తగా కనిపిస్తుంది.మొత్తంగా పాత కారు కంటే కొత్త కారు ప్రీమియం లుక్ తో కనిపిస్తుంది. ఇందులో ఆధునికరించిన సీట్లతోపాటు ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ కొత్తగా కనిపిస్తుంది. అలాగే ఇందులో 10.25 అంగుళాల టచ్ స్క్రీన్ ఇంపార్టైన్మెంట్ సిస్టం తో పాటు ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే 20 ఫీచర్లు ఉన్నాయి. అలాగే డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా ఇందులో కనిపిస్తుంది.

సేఫ్టీ కోసం ఈ కారులో ప్రత్యేకంగా ఫీచర్లు ఉన్నాయి. దేశీయ గ్లోబల్ రేటింగ్ లో 4 స్టార్ రేటింగ్ పొందిన ఇందులో డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్, EBS తో కూడిన ABS వంటివి కనిపిస్తాయి. ప్రజల్లో ఇప్పటికే ఆదరణ పొందిన కారుగా టాటా టియాగో నిలవడంతో.. దీని సామర్థ్యాన్ని కొనసాగించాలని ఉద్దేశంతో ఎలక్ట్రిక్ వాహనాన్ని తీసుకు వస్తున్నట్లు కంపెనీ ప్రతినిధులు తెలుపుతున్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version