Peddi movie criticism: రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో తనకెక్కిన ‘పెద్ది’ సినిమా రీసెంట్ గా రిలీజ్ అయింది. మొదటి చోటును సంపాదించుకున్న ఈ మూవీ ప్రస్తుతం సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. ఈ వీకెండ్ మొత్తం పెద్ది సినిమా హవా నే కొనసాగుతుంది. ప్రేక్షకులందరు ఈ సినిమా చూడడానికి విపరీతంగా ఆసక్తిని చూపిస్తున్నారు. అయితే ఒకసారి సినిమా చూసిన తర్వాత మరోసారి రిపీటెడ్ గా ఈ సినిమాను చూసే జనాల సంఖ్య తగ్గిపోయింది.
కారణం ఏంటంటే రిపీటెడ్ గా సినిమాను చూసే అంత గొప్ప కంటెంట్ అయితే ఈ సినిమాలో ఏమీ లేదని చాలామంది చెబుతున్నారు. నిజానికి కొన్ని సందర్భాల్లో బోరు కూడా కొట్టిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. అలాంటి పెద్ది సినిమా విషయంలో చాలామంది చెబుతున్న అభిప్రాయాన్ని బట్టి చూస్తే అది కరెక్టే అనిపిస్తుంది. ఇంతకీ ఏం చెబుతున్నారు అంటే రామ్ చరణ్ క్రికెటర్ గా రాణిస్తాడు. ఆ తర్వాత కుస్తీ ఫైట్ లో కూడా తన సత్తా ఏంటో చూపిస్తాడు.
ఈ సినిమాని కుస్తీ ఫైట్ లక్ష్యంగా పెట్టుకొని చేసే ఉంటే బాగుండేది. అది కాదని సినిమాని ఇంకా లాగుతూ రన్నర్ గా చూపించే ప్రయత్నం చేశారు. మొత్తానికైతే ఈ ప్రయత్నాలన్నీ బాగున్నప్పటికి చూసే ప్రేక్షకుడికి మాత్రం చివరి వరకు సినిమాను చూసేంత ఓపిక లేకుండా పోయిందనే చెప్పాలి. కాబట్టి కుస్తీ ఫైట్ తోనే ఈ సినిమాకి ఒక ముగింపు పలికుంటే సినిమా లాగ్ అయ్యేది కాదు.
అలాగే సినిమా చాలా క్రిస్పీగా వచ్చేది. స్క్రీన్ ప్లే ప్రకారం కూడా సినిమా చాలా ఎఫెక్టివ్ గా ఉండేదని పలువురు సినిమా మేధావులు చెబుతున్నారు. ఇక రన్నింగ్ రేస్ అనేది అనవసరంగా సినిమాలో ఇరికించినట్టు అనిపిస్తుంది తప్ప అది సినిమా ఫ్లోకి ఏమాత్రం పెద్దగా కనెక్ట్ కావడం లేదని సినిమా చూస్తున్న ప్రేక్షకులను సైతం అది ఎమోషనల్ గా టచ్ చేయడం లేదని మరి కొంతమంది భావిస్తున్నారు…
