spot_img
Homeఎంటర్టైన్మెంట్Peddi Movie: 'పెద్ది' చిత్రంలో నటించేందుకు ఒక్కొక్కరు తీసుకున్న రెమ్యూనరేషన్స్ లిస్ట్ ఇదే.

Peddi Movie: ‘పెద్ది’ చిత్రంలో నటించేందుకు ఒక్కొక్కరు తీసుకున్న రెమ్యూనరేషన్స్ లిస్ట్ ఇదే.

Peddi Movie: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ చిత్రం సరిగ్గా మరో 20 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ఎదో ఒక అప్డేట్ సోషల్ మీడియా లో లీక్ అవుతూ బాగా వైరల్ అవుతోంది. మేకర్స్ కూడా ఈ చిత్రం పై మరింత బజ్ పెంచడానికి రోజుకి ఒక అప్డేట్ విడుదల చెయ్యాలని ఫిక్స్ అయ్యారు. అందులో భాగంగా నిన్న ఈ చిత్రం లో ప్రధాన పాత్ర పోషించిన శివన్న క్యారెక్టర్ కి సంబంధించిన చిన్న గ్లింప్స్ వీడియో ని విడుదల చేశారు మేకర్స్. ఇందులో ఆయన గౌర్ నాయుడు అనే క్యారెక్టర్ చేశాడు. ఈ గ్లింప్స్ వీడియో కి సెన్సషనల్ రెస్పాన్స్ వచ్చింది. ఈరోజు కూడా ఎదో ఒక క్యారెక్టర్ కి సంబంధించిన ఫస్ట్ లుక్ , లేదా గ్లింప్స్ వీడియో ని విడుదల చేయబోతున్నారు మేకర్స్.

ఇదంతా పక్కన పెడితే ఈ చిత్రం లో నటించిన నటీనటుల రెమ్యూనరేషన్ వివరాలు సోషల్ మీడియా లో లీకై బాగా వైరల్ అయ్యింది. ముఖ్యంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఈ చిత్రం కోసం దాదాపుగా 86 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని అందుకున్నది టాక్. ‘గేమ్ చేంజర్ ‘ చిత్రానికి రామ్ చరణ్ దాదాపుగా 100 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ తీసుకున్నాడని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం అయ్యింది. ఆ సినిమా పెద్ద ఫ్లాప్ అవ్వడం తో , ఈ చిత్రానికి రెమ్యూనరేషన్ తగ్గించినట్టు తెలుస్తోంది. ఒకవేళ పెద్ది హిట్ అయితే లాభాల్లో కొంత వాటాలు రావొచ్చు. అదే విధంగా ఈ చిత్రం లో హీరోయిన్ గా నటించిన జాన్వీ కపూర్ 8 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ తీసుకుందట. అదే విధంగా ఈ చిత్రం లో ఐటెం సాంగ్ చేసిన శృతి హాసన్ దాదాపుగా 3 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ తీసుకున్నట్టు సమాచారం.

ఇకపోతే ఈ చిత్రం మీర్జాపూర్ ఫేమ్ దివ్యేన్దు కీలక పాత్ర పోషించాడు. ఈయన మున్నై భాయ్ గా యూత్ ఆడియన్స్ లో ఎంత మంచి క్రేజ్ తెచ్చుకున్నాడో మన అందరికీ తెలిసిందే. ఈ చిత్రం లో కీలక పాత్ర పోషించినందుకు గాను ఆయన 3 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ తీసుకున్నట్టు టాక్. అదే విధంగా కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ ఈ చిత్రం లో రామ్ చరణ్ కి కుస్తీ కోచ్ గా కనిపించాడు. ఆయన దాదాపుగా 5 కోట్ల రూపాయలకు పైగా రెమ్యూనరేషన్ తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ చిత్రం లో జగపతి బాబు అప్పలసూరి అనే కీలక పాత్ర పోషించాడు. అందుకు ఆయన రెండు కోట్ల రూపాయిలు తీసుకున్నట్టు టాక్. ఇక డైరెక్టర్ బుచ్చి బాబు ఈ చిత్రానికి దర్శకత్వం వహించినందుకు గాను 2 కోట్ల రూపాయిల అడ్వాన్స్ తీసుకున్నాడని , ఒకవేళ సినిమా హిట్ అయితే 10 కోట్ల వరకు ఆయనకు రెమ్యూనరేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version