Peddi break even target: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ చిత్రం వచ్చే నెల 4 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదల అవ్వబోతున్న సందర్భంగా, మేకర్స్ ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషనల్ కార్యక్రమాలను వేగవంతం చేశారు. సోషల్ మీడియా లో ఇప్పుడు ‘పెద్ది’ అనే పేరు తప్ప, మరో సినిమా పేరు కనిపించడం లేదు , ఆ రేంజ్ లో మేనియా క్రియేట్ అయిపోయింది. ఇదంతా పక్కన పెడితే భారీ అంచనాలు ఉండడం వల్ల, ఈ చిత్రానికి ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ కూడా కనీవినీ ఎరుగని రేంజ్ లో జరిగింది. ఉదాహరణకు ఓవర్సీస్ ప్రాంతం లో ఈ చిత్రానికి 10 మిలియన్ డాలర్లకు ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరిగింది. అంటే 100 కోట్ల రూపాయలకు పైమాటే. కేవలం ఒక్క నార్త్ అమెరికా లోనే ఈ చిత్రానికి 70 కోట్ల రూపాయిల బిజినెస్ జరగడం గమనార్హం.
ఈ రేంజ్ బిజినెస్ జరిగింది కాబట్టి , అడ్వాన్స్ బుకింగ్స్ కూడా అదే రేంజ్ లో ఉంటాయని అంతా అనుకున్నారు. కానీ బుకింగ్స్ మొదలు పెట్టి దాదాపుగా వారం రోజులు కావొస్తుంది , ఇప్పటి వరకు ఈ చిత్రానికి కేవలం 2 లక్షల 50 వేల డాలర్ల గ్రాస్ వసూళ్లు మాత్రమే బుకింగ్స్ ద్వారా వచ్చాయి. ఈ సినిమాకు ఉన్నటువంటి హైప్ కి ఇది చాలా తక్కువ గ్రాస్ అనే చెప్పాలి. ఇదే లెవెల్ హైప్ తో వచ్చిన పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ చిత్రానికి కేవలం 24 గంటల వ్యవధిలోనే 2 లక్షల 67 వేల డాలర్ల గ్రాస్ నమోదు అయ్యింది. దీనిని రామ్ చరణ్ అభిమానులు అవలీలగా బ్రేక్ చేయమని సవాళ్లు విసిరారు. ఎందుకంటే పెద్ది కి మొదటి 24 గంటల్లో 1 లక్షా 47 వేల డాలర్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి కాబట్టి.
కానీ ఆ తర్వాత వారం రోజులకు అదనంగా కేవలం 1 లక్ష డాలర్లు మాత్రమే వచ్చింది. ‘ఓజీ’ చిత్రం 24 గంటల్లో సాధించిన గ్రాస్ ని , ఈ చిత్రం ఇప్పటి వరకు అందుకోలేకపోయింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే మాత్రం , ఈ చిత్రానికి బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవడం చాలా కష్టమని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఎందుకంటే 7 మిలియన్ డాలర్లు లాంగ్ రన్ లో రాబట్టడం అనేది సాధారణమైన విషయం కాదు. ఇప్పుడు నార్త్ అమెరికా లో మన తెలుగు సినిమాలకు వీకెండ్ వరకు మాత్రమే భారీ గ్రాస్ వసూళ్లు నమోదు అవుతున్నాయి , ఆ తర్వాత భారీగా పడిపోతున్నాయి. ప్రస్తుతం ఉన్న స్పీడ్ చూస్తుంటే , ఈ చిత్రానికి 1.5 మిలియన్ నుండి 2 మిలియన్ డాలర్ల మధ్యలో గ్రాస్ వసూళ్లు నమోదు అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. చూడాలి మరి ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుంది అనేది.
