Peddi Movie
Peddi Movie : ఇప్పటి వరకు చాలా మంది హీరోలు చాలా సినిమాలను చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు. స్టార్ హీరోలు సూపర్ హిట్ సినిమాలను చేస్తూ ఎవ్వరికి అందనంత ఎత్తులోకి ఎదుగుతున్నారు. కానీ మీడియం రేంజ్ హీరోలు మాత్రం మీడియం బడ్జెట్ తో సినిమాలను చేస్తూ సక్సెస్ లను అందుకోవాలని చూస్తున్నారు. ఇక ఎవరు ఎలాంటి సినిమా చేసిన ఇండస్ట్రీ లో సక్సెస్ ఉన్నవాళ్ళకే క్రేజ్ ఉంటుంది… అందుకే అందరు ఒక్క సక్సెస్ ను సాధించడానికి చాలా రకాల కష్టాలు పడుతూ ఉంటారు…
Also Read : టికెట్ ధరలు తగ్గిస్తూ ఏపీ ప్రభుత్వం ఇచ్చిన జీవోను రద్దు చేసిన హైకోర్టు!
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఉన్న చాలా మంది నటులు భారీ సినిమాలను చేస్తూ ముందుకు దూసుకెళ్తున్న క్రమంలో వాళ్ళను వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది. పాన్ ఇండియాలో ఇప్పుడు తెలుగు సినిమాల హవా ఎక్కువగా కొనసాగుతున్న నేపధ్యంలో తనదైన రీతిలో సత్తా చాటుకుంటు భారీ విజయాలను అందుకోవాల్సిన అవసరమైతే ఉంది. ఇక ప్రస్తుతం మైత్రి మూవీ మేకర్స్ యొక్క హవా ఎక్కువగా కొనసాగుతుందనే చెప్పాలి. గత సంవత్సరం ‘పుష్ప 2’ తో పాన్ ఇండియా లెవల్లో వాళ్ల సత్తా చాటారు. ఇక ఈ ఇయర్ కూడా భారీ సినిమాలు రాబోతున్నాయి… రీసెంట్ గా మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్ అయిన రవి శంకర్ తమ బ్యానర్ నుంచి రాబోయే 6 సినిమాలు ఆరు ప్రత్యేకతలను కలిగి ఉన్నాయని చెప్పారు…ముఖ్యంగా రామ్ చరణ్ బుచ్చి బాబు కాంబోలో వస్తున్న ‘పెద్ది’ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఈ రోజు రిలీజ్ చేశారు.
అయితే ఈ సినిమా నుంచి వచ్చే టీజర్ నెక్స్ట్ లెవల్లో ఉంటుందట. అందులో ఒక షాట్ అయితే ఎవరు ఊహించలేని విధంగా ఉంటుందని దానికోసమే ఈ టీజర్ ను 1000 సార్లు చూస్తారు అంటు ఆయన చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ సినిమాతో పాటుగా హను రాఘవపూడి ప్రభాస్ కాంబోలో వస్తున్న సినిమా ఎమోషనల్ గా ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. అలాగే ప్రశాంత్ నీల్ ఎన్టీయార్ కాంబోలో వస్తున్న సినిమా ఔట్ ఆఫ్ ది బాక్స్ ఉండబోతుంది…
ఇక పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా సైతం పవర్ స్టార్ స్టామినాను చూపిస్తుందని చెప్పారు. అలాగే విజయ్ దేవరకొండ రాహుల్ సాంకృత్యాన్ కాంబోలో వస్తున్న సినిమా సైతం ప్రేక్షకులందరికి నచ్చుతుందని ఆయన చెప్పారు…
ఇక ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో వస్తున్న ‘జై హనుమాన్’ సినిమా సైతం నెక్స్ట్ లెవల్లో ఉండబోతుందని ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు…ఇక ఈ సినిమా షూటింగ్ లో రిషబ్ శెట్టి సెప్టెంబర్ నుంచి జాయిన్ అవుతాడని చెప్పాడు…మొత్తానికైతే ఆయన చేస్తున్న ప్రతి సినిమా మంచి విజయాన్ని సాధిస్తుందని ఆయన చాలా మంచి కాన్ఫిడెంట్ తో ఉన్నాడు. ఇక నితిన్ తో వాళ్ళు చేసిన ‘రాబిన్ హుడ్’ సినిమా రేపు రిలీజ్ అవుతుంది…
Also Read : ‘పుష్ప’ లుక్ ని తలపించిన రామ్ చరణ్ ‘పెద్ది’ ఫస్ట్ లుక్ పోస్టర్!