Peddi: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు రామ్ చరణ్(Ram Charan) తనదైన రీతిలో సత్తా చాటుకోవడానికి అహర్నిశలు ప్రయత్నమైతే చేస్తున్నాడు. ఇక తనదైన రీతిలో భారీ విజయాలను అందుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్న ఈ స్టార్ హీరో ఇప్పుడు బుచ్చిబాబు డైరెక్షన్ లో ‘పెద్ది’ (Peddi) అనే సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘గేమ్ చేంజర్’ (Game Changer) సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు. దాంతో ఇప్పుడు చేయబోతున్న పెద్ది (Peddi) సినిమాతో ఎలాగైనా భారీ సక్సెస్ ని సాధించి తనకంటూ ఒక ఐడెంటిటిని సంపాదించుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. మరి తను అనుకున్నట్టుగానే ఇక మీదట చేయబోతున్న సినిమాలన్నింటితో భారీ విజయాన్ని అందుకోవాలని చూస్తున్నాడు. రీసెంట్ గా పెద్ది సినిమా నుంచి రామ్ చరణ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇక దానికి మంచి క్రేజ్ రావడంతో ఇప్పుడు శ్రీరామనవమి సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన గింప్స్ ని రిలీజ్ చేసి ప్రేక్షకులందరిలో మంచి గుర్తింపును సంపాదించుకోవాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది…
Also Read: తిట్టినందుకు లెంపలేసుకుంటున్నా.. చేతులుకాలాక ఆకులు పట్టుకున్న అలేఖ్య చిట్టి
ఇక ఈ గ్లింప్స్ కు సంబంధించిన అన్ని పనులను పూర్తి చేసి పెట్టారు. దానికి సంబంధించిన ఏ ఆర్ రెహమాన్ తో బుచ్చిబాబు ఉండి గ్లింప్స్ ని చూసినట్టుగా ఒక పిక్ ను కూడా పోస్ట్ చేశారు. మరి దాంతో ఈ గ్లింప్స్ రిలీజ్ కి సర్వం సిద్ధం చేసినట్టుగా వార్తలైతే వస్తున్నాయి.
మరి రేపు రాబోతున్న గ్లింప్స్ ఎలా ఉంటుంది ప్రేక్షకులను మెప్పిస్తుందా? లేదా అనేది ఇప్పుడు అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తుంది. మరి మొత్తానికైతే బుచ్చిబాబు ఈ సినిమా గ్లింప్స్ ని నెక్స్ట్ లెవెల్లో ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక బుచ్చిబాబు తన రెండో సినిమాతోనే రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోను డైరెక్షన్ చేస్తున్నాడు.
కాబట్టి ఈ సినిమాతో ఎలాగైనా సరే మంచి విజయాన్ని అందుకోవాలనే దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నాడు. మరి తను అనుకున్నట్టుగానే ఈ సినిమాతో సూపర్ సక్సెస్ సాధిస్తే ఇండియాలోనే వన్ ఆఫ్ ది టాప్ డైరెక్టర్ గా ఎదుగుతాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…ఇక తన గురువుగారు అయిన సుకుమార్ పక్కన సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా నిల్చుంటాడా లేదా అనేది తెలియాల్సి ఉంది…చూడాలి మరి రేపు రాబోతున్న ఈ మూవీ గ్లింప్స్ ఎలాంటి రెస్పాన్స్ ను సంపాదించుకుంటుంది అనేది…