Payal Ghosh: హీరో మంచు మనోజ్ ‘ప్రయాణం’సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయమైంది ‘పాయల్ ఘోష్’.. ఆ తర్వాత తెలుగు తెర పై పెద్దగా మెరుపులు మెరిపించలేకపోయింది. ప్రయాణం తర్వాత కొన్ని చిత్రాల్లో హీరోయిన్ గా నటించినా సక్సెస్ లేక చివరకు ఫేడ్ అవుట్ అయిపోయింది. ఎన్టీఆర్ ‘ఊసరవెల్లి’లో తమన్నా స్నేహితురాలిగా ఒక సైడ్ క్యారెక్టర్ లో నటించింది. అయితే, తాజాగా ఈ హాట్ బ్యూటీ ఎన్టీఆర్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ పై హీరోయిన్ పాయల్ ఘోష్ ప్రశంసలు కురిపించింది. ‘ఆయన గ్లోబల్ స్టార్, లవింగ్ కోస్టార్.. అన్నింటికీ మించి ఆల్ రౌండర్ సూపర్ స్టార్. ఈ విషయాలు ఎప్పుడో చెప్పాను. కానీ నన్ను అందరూ విమర్శించారు. తప్పుగా మాట్లాడారు. ఆయన స్టామినా గురించి తెలిసే ఇవన్నీ చెబుతూ వచ్చాను. ఇప్పుడు ప్రపంచానికి తెలుస్తోంది’ అని ట్వీట్ చేసింది. ఎన్టీఆర్ నటించిన ‘ఊసరవెల్లి’లో పాయల్ సెకండ్ హీరోయిన్‌గా నటించింది.
Also Read: దివంగత పునీత్ రాజ్ కుమార్ పై ప్రశంసల వర్షం !
ఇక పాయల్ ఈ మధ్య పాయల్ ఓ ఇంట్రెస్టింగ్ కేసుతో వార్తలెక్కింది. గుర్తు తెలియని వ్యక్తులు తన పై యాసిడ్ దాడి చేసే ప్రయత్నం చేశారని పాయల్ ఘోష్ కేసు పెట్టింది. చేతికి గాయాలైన పిక్ ను కూడా తన ఇన్‌స్టా వేదికగా పోస్ట్ చేసి అందరికీ షాక్ ఇచ్చింది. పాయల్ మెసేజ్ పోస్ట్ చేస్తూ.. ‘చాలా రోజుల తర్వాత బయటకు వెళ్లి.. ఇంట్లో వాళ్లకు కావాల్సిన మందులు తీసుకొచ్చే వద్దామని వెళ్లాను. నా పనులన్నీ పూర్తి చేసుకుని కారు ఎక్కుతుంటే.. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ముఖానికి మాస్కులు ధరించి.. నాపై దాడి చేశారని రాసుకొచ్చింది.
అయితే, ఆమె వారి నుంచి తప్పించుకున్నప్పటికీ ఆ సమయంలో తన చేతికి స్వల్ప గాయాలయ్యాయని, అయితే వాళ్ల చేతుల్లో యాసిడ్ బాటిల్స్ ఉన్నాయి. వాటిని చూసిన వెంటనే సాయం కోరుతూ గట్టిగా కేకలు వేశాను. దాంతో వాళ్లు అక్కడి నుంచి పారిపోయారు. ఆ సంఘటన తర్వాత ప్రతి క్షణం నాకు భయమేస్తోంది. దానిని తలుచుకుంటుంటే ఇప్పటికీ కంగారుగానే ఉంది’ అంటూ పాయల్ రీసెంట్ గా సోషల్ మీడియాలో కూడా బాగానే హడావుడి చేసింది. మరి ఆ కేసు ఏమైందో మళ్ళీ దాని గురించి అప్ డేట్ లేదు.
Also Read: ప్చ్.. వివాదాల రాణి మళ్ళీ చెలరేగింది !