https://oktelugu.com/

పాయల్‌ జాక్‌పాట్‌.. ఇటు బన్నీతో అటు కమల్‌ హాసన్‌తో!

ఆర్ఎక్స్‌ 100 సినిమాలో అందల ప్రదర్శనతో పాటు నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న హీరోయిన్‌ క్యారెక్టర్తో యువత హార్ట్‌ బీట్‌ పెంచిన నటి పాయల్‌ రాజ్‌పుత్. ఆపై, ‘ఆర్డీఎక్స్‌ లవ్‌’లో మరింత బోల్డ్‌గా కనిపించినప్పటికీ ఆ చిరు చిత్రం బాక్సాఫీస్‌ దగ్గర బోల్తా కొట్టింది. కానీ, ‘వెంకీ మామ’, ‘డిస్కో రాజా’ చిత్రాలతో నటనలో మెప్పించి టాలీవుడ్‌లో నిలదొక్కుకుంది ఈ ఢిల్లీ భామ. కానీ, కెరీర్ను మలుపు తిప్పే బ్రేక్‌ కోసం ఎదురూ చూస్తూనే ఉంది. అందుకే మొన్నటిదాకా […]

Written By:
  • admin
  • , Updated On : July 2, 2020 / 07:38 PM IST
    Follow us on


    ఆర్ఎక్స్‌ 100 సినిమాలో అందల ప్రదర్శనతో పాటు నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న హీరోయిన్‌ క్యారెక్టర్తో యువత హార్ట్‌ బీట్‌ పెంచిన నటి పాయల్‌ రాజ్‌పుత్. ఆపై, ‘ఆర్డీఎక్స్‌ లవ్‌’లో మరింత బోల్డ్‌గా కనిపించినప్పటికీ ఆ చిరు చిత్రం బాక్సాఫీస్‌ దగ్గర బోల్తా కొట్టింది. కానీ, ‘వెంకీ మామ’, ‘డిస్కో రాజా’ చిత్రాలతో నటనలో మెప్పించి టాలీవుడ్‌లో నిలదొక్కుకుంది ఈ ఢిల్లీ భామ. కానీ, కెరీర్ను మలుపు తిప్పే బ్రేక్‌ కోసం ఎదురూ చూస్తూనే ఉంది. అందుకే మొన్నటిదాకా పంజాబీ సినిమాలతో తెలుగులో నటించగా… ఇప్పుడు కేవలం దక్షిణాదిపైనే దృష్టి పెట్టింది. ‘ఏంజెల్’ అనే సినిమాతో తమిళ్‌లో అరంగేట్రం చేయనుంది. మరోవైపు తెలుగులో ‘నరేంద్ర’ అనే మూవీల నటిస్తోందామె. ఓ వెబ్‌ సిరీస్‌కు కూడా ఓకే చెప్పింది. ఒకపక్క లీడ్‌, సెకండ్‌ హీరోయిన్‌ రోల్స్‌ పోషిస్తూనే ఐటమ్‌ సాంగ్స్‌ బాట పట్టిన పాయల్‌ రెండు చేతులా సంపాదిస్తోంది. తేజ దర్శకత్వం వహించిన ‘బుల్‌రెడ్డి’ అనే ఐటమ్‌ సాంగ్‌లో ఆల్రెడీ మెప్పించింది. ఇప్పుడు మరో రెండు భారీ ఆఫర్లు ఆమెకు వచ్చినట్టు సమాచారం.

    టీవీ9 రవిప్రకాష్, ఆ హీరోకు బిగుసుకుంటున్న ఉచ్చు?

    అందులో ఒకటి అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పుష్ప’. తన ప్రతీ సినిమాలోనూ ప్రత్యేక పాట ఉండేలా చూసుకుంటాడు సుకుమార్. బన్నీతోనే చేసిన ఆర్య 1, 2 సినిమాల్లో ‘ ఆ అంటే అమలాపురం’, ‘రింగ రింగా’ పాటలతో ఒకరకంగా టాలీవుడ్‌లో ఐటమ్‌ నంబర్స్‌ను మరో లెవెల్‌కు తీసుకెళ్లాడు సుక్కు. తన లాస్ట్‌ మూవీ ‘రంగస్థలం’లో పూజా హెగ్డేతో ‘జిగేల్‌’ అనిపించాడు. దాంతో, సుకుమార్ సినిమా వస్తుందంటే హీరో, హీరోయిన్లు ఎవరు తర్వాత ఐటమ్‌ సాంగ్‌లో నటించేదెవరూ? అని అడిగే పరిస్థితి వచ్చింది. పైగా, డ్యాన్స్‌కు కేరాఫ్ అడ్రస్‌ అయిన బన్నీతో సాంగ్ అంటే మామూలుగా ఉండదు. ఈ క్రేజ్‌ దృష్ట్యా మొదట బాలీవుడ్‌ నటి ఊర్వశి రౌతేలా ను చిత్ర బృందం సంప్రదించినట్టు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత మరో ఇద్దరు పేరున్న హీరోయిన్లను అడిగినా చివరకు పాయల్‌ రాజ్‌పుత్‌ను ఖాయం చేసినట్టు టాలీవుడ్‌ వర్గాల సమాచారం. ఇదే లక్కీ ఆఫర్ అనుకుంటే మరో పాన్‌ ఇండియా మూవీలో కూడా నర్తించే చాన్స్‌ పాయల్‌కు వచ్చిందని తెలుస్తోంది. సౌత్‌ స్టార్హీరో కమల్‌ హాసన్, దిగ్గజ దర్శకుడు శంకర్ కాంబినేషనల్లో వస్తున్న భారతీయుడు-2లో కూడా ఓ స్పెషల్‌ సాంగ్‌ కోసం పాయల్‌ను ఎంచుకున్నట్టు సమాచారం. హీరోయిన్‌గా కెరీర్ ఎలా ఉన్నా.. ఈ రెండు మూవీల్లో స్పెషల్‌ నంబర్స్‌ చేస్తే పాయల్‌ పేరు మార్మోగడం ఖాయమే.