https://oktelugu.com/

క్రేజీ కలయికలో.. ఏదో జరగబోతుంది !

ఎలాంటి సపోర్ట్ లేకుండా చిన్నాచితకా క్యారెక్టర్స్ చేసుకుంటూ.. కన్నడనాట ఏకంగా రాకింగ్ స్టార్ గా ఎదిగిపోయాడు యశ్. పైగా యశ్ కథానాయకుడిగా ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన `కేజీఎఫ్ చాప్టర్- 1` సృష్టించిన సంచలనాలు ఇంతవరకూ ఏ కన్నడ సినిమా సృష్టించలేదు. వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద అద్భుత‌ వసూళ్లు సాధించింది ఈ చిత్రం. దాంతో యశ్ మార్కెట్ కన్నడ టాప్ హీరోలందరీ కంటే ఎక్కువైపోయింది. ఇక కెజియఫ్ సీక్వెల్ గురించి తాజాగా దర్శకుడు ప్రశాంత్ నీల్ ట్విట్టర్ […]

Written By:
  • admin
  • , Updated On : July 2, 2020 / 07:31 PM IST
    Follow us on


    ఎలాంటి సపోర్ట్ లేకుండా చిన్నాచితకా క్యారెక్టర్స్ చేసుకుంటూ.. కన్నడనాట ఏకంగా రాకింగ్ స్టార్ గా ఎదిగిపోయాడు యశ్. పైగా యశ్ కథానాయకుడిగా ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన `కేజీఎఫ్ చాప్టర్- 1` సృష్టించిన సంచలనాలు ఇంతవరకూ ఏ కన్నడ సినిమా సృష్టించలేదు. వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద అద్భుత‌ వసూళ్లు సాధించింది ఈ చిత్రం. దాంతో యశ్ మార్కెట్ కన్నడ టాప్ హీరోలందరీ కంటే ఎక్కువైపోయింది.

    ఇక కెజియఫ్ సీక్వెల్ గురించి తాజాగా దర్శకుడు ప్రశాంత్ నీల్ ట్విట్టర్ లో ఓ ఇంట్రస్టింగ్ పోస్ట్ పెట్టారు. ‘ఏదో జరగబోతుంది. మీరు అదేమిటో ఊహిస్తూ ఉండండి’ అంటూ రెండు ఫోటోలను కూడా షేర్ చేశారు.

    హైదరాబాద్ లో నో-లాక్‌డౌన్.. కారణాలివే?

    రెండు ఫోటోలలో యశ్ తో పాటు ప్రశాంత్ నీల్ కూడా ఉండటం, పైగా వీరిద్ధరి పై ఓ వీడియో చిత్రీకరిస్తుండగా.. ఫోటోలు తీసినట్లు ఆ ఫోటోలు ఉండటం.. ఆసక్తి రేపుతోంది. ఇంతకీ వీరి పై వీడియో దేని గురించి తీస్తున్నారో చూడాలి. ఆ వీడియోలో సీక్వెల్ సంగతులు తెలుపుతారో.. లేక కరోనా గురించి తమ వంతు జాగ్రత్తలు చెబుతారో. ఒకటి మాత్రం నిజం.. కెజిఎఫ్ 2 కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పైగా ఈ సీక్వెల్ లో ప్రధానమైన ప్రతినాయకుడు అధీరా పాత్రలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ చేస్తుండటంతో బాలీవుడ్ లోనూ ఈ సినిమా పై విపరీతమైన అంచనాలు ఉన్నాయి. అయితే రఫ్ ఎడిటింగ్ పూర్తి అయిన ఈ సినిమాలో సంజయ్ దత్ సీన్స్ అన్నీ అద్భుతంగా వచ్చాయని సంజయ్ చాల కొత్తగా కనిపించబోతున్నారని తెలుస్తోంది.

    ఏమైనా ఇండియా లెవల్లో కొన్ని మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో ఈ సినిమా ముందువరుసలో నిలుస్తోంది. మొదటి పార్ట్ బంపర్ హిట్ అవ్వడంతో పాటు యాక్షన్ క్లాసిక్ అనే ముద్ర రావడం, ఈ సినిమా అన్ని భాషల ఇండస్ట్రీ ప్రేమికులను బాగా ఆకట్టుకోవడంతో అందరూ ఈ సినిమా కోసం బాగా ఎదురు చూస్తున్నారు. ఇక కేజీఎఫ్ అంటే.. ద‌శాబ్ధాల క్రితం కోలార్ బంగారు గ‌నుల పై రౌడీల కన్ను, ప్ర‌పంచ మాఫియా క‌న్ను ఎలా ఉండేది అన్న‌ కోణంలో సినిమా సాగుతోంది. ఈ మూవీలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది.