https://oktelugu.com/

Payal Rajput-Allu Arjun: ఏ చిలిపి.. నన్ను అలా చూడకు.. అల్లు అర్జున్ పై పాయల్ హాట్ కామెంట్స్…

ఇక ఇలాంటి క్రమంలోనే మంగళవారం సినిమాకు సంబంధించిన ప్రి రిలీజ్ ఈవెంట్ రీసెంట్ గా జరిగింది.ఈ ఈవెంట్ కి అల్లు అర్జున్ వచ్చాడు. ఇక ఈ ఈవెంట్ లో ముఖ్యంగా పాయల్ రాజ్ పుత్ మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి...

Written By:
  • Neelambaram
  • , Updated On : November 13, 2023 / 12:44 PM IST
    Follow us on

    Payal Rajput-Allu Arjun: సినిమా ఇండస్ట్రీ లో ఒక సినిమా పైన క్రేజ్ పెరగాలంటే ఆ సినిమాను అబ్లిక్ లోకి తీసుకెళ్లాలి పెద్ద సినిమా అయితే ఆటోమేటిక్ గా పబ్లిక్ లోకి వెళ్తుంది కానీ చిన్న సినిమాలు పబ్లిక్ లోకి వెళ్ళాలి అంటే దానీ ప్రా పబ్లిసిటీ అనేది కావాలి.ఇక అందులో భాగంగానే ఒక్కో సినిమా మేకర్స్ ఒక్కో విభిన్నమైన వైఖరిని పాటిస్తూ వాళ్ల సినిమాని పబ్లిక్ లోకి తీసుకెళ్తూ ఉంటారు…

    ఇక అందులో భాగంగానే ప్రి రిలీజ్ ఈవెంట్స్ కి గెస్ట్ లు గా స్టార్ హీరోలని ఆహ్వానిస్తూ ఉంటారు. వాళ్లు వచ్చి ఆ సినిమా గురించి నాలుగు మాటలు చెప్తే సినిమాకి మంచి పబ్లిసిటీ అవుతుంది.అలాగే ఆ సినిమాకి మార్కెట్ కూడా విపరీతంగా పెరుగుతుంది అనే ఉద్దేశ్యం తోనే దర్శక , నిర్మాతలు ఇలా చేస్తూ ఉంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే మంగళవారం సినిమాకు సంబంధించిన ప్రి రిలీజ్ ఈవెంట్ రీసెంట్ గా జరిగింది.ఈ ఈవెంట్ కి అల్లు అర్జున్ వచ్చాడు. ఇక ఈ ఈవెంట్ లో ముఖ్యంగా పాయల్ రాజ్ పుత్ మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి…

    ఆమె స్టేజ్ పైకి ఎక్కి అందరికీ నమస్కారం అంటూ తన స్పీచ్ ను స్టార్ట్ చేసింది. ఇక అందులో భాగంగానే కొంచెం తెలుగు, కొంచెం హిందీ, కొంచెం ఇంగ్లీష్ భాషలను మిక్స్ చేస్తూ మాట్లాడుతూ ప్రేక్షకులందరిని అలరించింది. ఇక ఆమె మాట్లాడిన మాటల్లో ముఖ్యంగా అల్లు అర్జున్ గురించి మాట్లాడిన మాటలు మాత్రం ఇప్పుడు చాలా వైరల్ గా మారాయి. అల్లు అర్జున్ ను చూస్తూనే మీరు అలా చూస్తే నేనిక్కడ స్పీచ్ సరిగ్గా మాట్లాడలేకపోతున్నాను సార్ , నా మైండ్ బ్లాంక్ అయిపోతుంది. అంటూనే, గతంలో ట్రైలర్ లాంచ్ అప్పుడు ఆమె చెప్పిన కొన్ని మాటలను కూడా గుర్తు చేసుకుంది అవి ఏంటి అంటే ఎవరినైతే మనం కలవాలి అని గట్టిగా అనుకుంటామో ఆ ప్రకృతి వాళ్లను మన ముందుకు తీసుకొస్తుంది అంటూ ప్రస్తుతం అల్లు అర్జున్ గారితో మేము ఉండడం మా అదృష్టం అంటూ చెప్పింది…

    ఇక అజయ్ భూపతి డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా మీద ప్రేక్షకులలో మంచి అంచనాలు ఉన్నాయి. ఇక వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన ఆర్ఎక్స్ 100 సినిమా సూపర్ డూపర్ హిట్ అవడంతో ఇప్పుడు మళ్ళీ పాయల్ రాజ్ పుత్ అజయ్ భూపతి కాంబినేషన్ లోనే రావడం అనేది ప్రేక్షకులందరిలో విపరీతమైన ఆసక్తిని రేకెత్తిస్తుంది…ఇక ఇప్పటికే అజయ్ భూపతికి మహాసముద్రం లాంటి ఫ్లాప్ సినిమా ఎదురైనప్పటికీ ఈ సినిమా మీద మాత్రం మంచి అంచనాలే ఉన్నాయి…