https://oktelugu.com/

బాపురే.. పవన్ మళ్లీ మారిపోయాడు.. షాక్ లో అభిమానులు..!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అటూ రాజకీయాల్లో ఇటూ సినిమాల్లో బీజీగా ఉన్నారు. ప్రజా సమస్యలపై పోరాడుతూనే వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ అభిమానుల్లో జోష్ నింపుతున్నాడు. పవన్ రీ ఎంట్రీ మూవీగా ‘వకీల్ సాబ్’ రాబోతుంది. బాలీవుడ్లో సూపర్ హిట్టుగా నిలిచిన ‘పింక్’ మూవీని తెలుగులో దిల్ రాజు, శ్రీదేవి భర్త బోనికపూర్ నిర్మిస్తున్నారు. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తుండగా థమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. Also Read: డ్రగ్స్ కేసు: ప్రముఖ యాంకర్ కు […]

Written By: , Updated On : September 25, 2020 / 03:06 PM IST
pawankalyan

pawankalyan

Follow us on

pawankalyanపవర్ స్టార్ పవన్ కల్యాణ్ అటూ రాజకీయాల్లో ఇటూ సినిమాల్లో బీజీగా ఉన్నారు. ప్రజా సమస్యలపై పోరాడుతూనే వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ అభిమానుల్లో జోష్ నింపుతున్నాడు. పవన్ రీ ఎంట్రీ మూవీగా ‘వకీల్ సాబ్’ రాబోతుంది. బాలీవుడ్లో సూపర్ హిట్టుగా నిలిచిన ‘పింక్’ మూవీని తెలుగులో దిల్ రాజు, శ్రీదేవి భర్త బోనికపూర్ నిర్మిస్తున్నారు. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తుండగా థమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు.

Also Read: డ్రగ్స్ కేసు: ప్రముఖ యాంకర్ కు నోటీసులు

‘వకీల్ సాబ్’ షూటింగ్ శరవేగంగా జరుపుకున్న క్రమంలో కరోనా ఎఫెక్ట్ తో సినిమా నిలిచిపోయింది. ఇటీవలే టాలీవుడ్లో సినిమా షూటింగులు ప్రారంభమైన ‘వకీల్ సాబ్’ మాత్రం ప్రారంభం కాలేదు. కాగా పవన్ కల్యాణ్ ఇటీవల చతుర్మాస ధీక్ష కారణంగా బారుగా గుబురుగా గడ్డం పెంచి కొంచెం లావుగా కనిపించారు. అయితే కొద్దిరోజుల గ్యాపులోనే పవన్ స్లిమ్ లుక్కులోని మారిపోవడంతో ఫ్యాన్స్ అవాక్కవుతున్నారు.

ప్రస్తుతం పవన్ కల్యాణ్ స్లిమ్ గా మారిన ఫొటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. తాజా ఫొటోల్లో పవన్ కల్యాణ్ ‘వకీల్ సాబ్’ కోసం స్లిమ్ గా ట్రిమ్డ్ షేవ్ లుక్కుతో మ్యాన్లీగా మారిపోయాడు. కొద్దిరోజుల క్రితం వరకు గుబురు గడ్డంతో లావుగా కన్పించిన పవన్ కల్యాణ్ ప్రస్తుతం స్లిమ్ లుక్కులో కన్పిస్తుండటంతో ప్రతీఒక్కరు ఆశ్చర్యపోతున్నారు.

Also Read: ఉన్నట్టు ఉండి ఆ పోస్ట్ ఎందుకు చేసిందో ?

ఇక రాంచరణ్ కూడా తాజాగా సోషల్ మీడియాలో తన లుక్కును షేర్ చేశాడు. ‘ఆర్ఆర్ఆర్’ రామరాజు పాత్ర కోసం తాను మేక్ ఓవర్ అయిన తీరును చూసి ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. కొంతకాలంగా షూటింగులకు దూరంగా ఉంటున్న మెగా హీరోలు మళ్లీ సినిమా లుక్ లోకి మారుతున్నారు. దీంతో ‘వకీల్ సాబ్’.. ‘ఆర్ఆర్ఆర్’ మూవీ షూటింగులు త్వరలోనే ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెల మొదటి వారంలో పవన్ కల్యాణ్ ‘వకీల్ సాబ్’ షూటింగ్ పాల్గొంటారనే టాక్ జోరుగా విన్పిస్తోంది.