పవన్ – దిల్ రాజు – వంశీ పైడిపల్లి మూవీ సెట్ అయినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. పవన్ తో తానూ రెండో సినిమాని నిర్మించాలని దిల్ రాజ్ నిర్ణయించుకోవడానికి కారణం వంశీనేనట. వంశీ చెప్పిన కథ నచ్చిన తరువాతే, దిల్ రాజు దైర్యంగా వెళ్లి పవన్ ను కలిసి మరో సినిమా చేద్దామని ప్రపోజల్ పెట్టాడు. మొత్తానికి ఈ ముగ్గురు కలయికలో సినిమా ఖరారు అయింది.
కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం వంశీ పైడిపల్లి చెప్పిన కథ పవన్ కు కూడా చాల బాగా నచ్చిందని, అందుకే పవన్ కళ్యాణ్ కూడా వెంటనే సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. అన్నట్టు ఈ సినిమా పూర్తిస్థాయి యాక్షన్ చిత్రంగా ఉండబోతోందని, ప్రత్యేకంగా క్రేజీ యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో వంశీ పైడిపల్లి ఈ సినిమాని రూపొందించే ఆలోచనలో ఉన్నారని.. పవన్ ను పూర్తి యాక్షన్ హీరోగా చూపించబోతున్నాడని సమాచారం.
ఎలాగూ వంశీ – పవన్ కాంబినేషన్ అంటే భారీ అంచనాలే ఉంటాయి. అందుకే ఈ సినిమాని పాన్ ఇండియా సినిమాలా మలచాలని దిల్ రాజు ఆలోచన చేస్తున్నాడు. పైగా వంశీ లాస్ట్ మూవీ ‘మహర్షి’ కూడా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్ల వర్షం కురిపించి.. దిల్ రాజుకి ఆ సినిమా కాసుల పంట పండించింది. అందుకే వంశీతో పాన్ ఇండియా సినిమా చేయడానికి తెగ ఉత్సాహ పడుతున్నాడు దిల్ రాజు.
ఇక ఈ లోపు వంశీ స్క్రిప్ట్ వర్క్ మీదే కూర్చుంటాడట. నిజానికి ఒక డైరెక్టర్ గా వంశీ పైడిపల్లి ‘మహర్షి’ లాంటి సూపర్ హిట్ సినిమా ఇచ్చిన తరువాత కూడా, మరో సినిమా కోసం చాల కష్టపడాల్సి వచ్చింది. ఒక్క స్టార్ హీరో కూడా వంశీని పిలిచి సినిమా చేస్తానని అడగలేదు. అసలు ఏవరేజ్ రేంజ్ సినిమాల డైరెక్టర్స్ కే అవకాశాలు వెల్లువులా వస్తుంటే.. పాపం వంశీకి మాత్రం ఒక్క ఛాన్స్ కూడా రాలేదు. ఇప్పుడు కూడా దిల్ రాజు చనువుతోనే పవన్ – వంశీ సినిమా సెట్ అయింది.
పోనిలే కనీసం ఇప్పటికైనా వంశీకి ఒక సినిమా సెట్ అయింది, ఇప్పటికే పవర్ స్టార్ ను కథతో ఒప్పించాడు. అందుకే అక్టోబర్ లో దసరా స్పెషల్ గా ఈ సినిమాని మొదలుపెట్టడానికి ముహూర్తం ఫిక్స్ చేశారని తెలుస్తోంది. అన్నట్లు వంశీ త్వరలోనే పవన్ ను కలిసి ఫుల్ స్క్రిప్ట్ చెప్పనున్నాడు.