https://oktelugu.com/

ఉచిత టీకా: ప్రజలకు భరోసానిస్తున్న జగన్, కేసీఆర్

ఓవైపు కరోనా రక్కసి తరుముకొస్తోంది. సెకండ్ వేవ్ అంటూ లక్షల కేసులు, వేల ప్రాణాలు తీస్తోంది. అధికారిక లెక్కల ప్రకారమే దేశంలో రోజుకు సగటున 3 లక్షలకు పైగా కేసులు నమోదువుతున్నాయి. 2వేలకు పైగా మరణాలు సంభవిస్తున్నాయి. అనధికారికంగా ఈ లెక్కలు డబుల్, త్రిబుల్ ఉండొచ్చు. ఇక ఇన్నాళ్లు 45 ఏళ్ల పైబడిన వారికి, దీర్ఘకాలిక రోగులకు కేంద్రప్రభుత్వమే ఉచితంగా కరోనా టీకాలు ఇచ్చింది. ఇక ఇప్పుడు ఓపెన్ మార్కెట్ లో కరోనా అమ్మేందుకు కొన్ని కంపెనీలకు […]

Written By:
  • NARESH
  • , Updated On : April 24, 2021 4:42 pm
    Follow us on

    ఓవైపు కరోనా రక్కసి తరుముకొస్తోంది. సెకండ్ వేవ్ అంటూ లక్షల కేసులు, వేల ప్రాణాలు తీస్తోంది. అధికారిక లెక్కల ప్రకారమే దేశంలో రోజుకు సగటున 3 లక్షలకు పైగా కేసులు నమోదువుతున్నాయి. 2వేలకు పైగా మరణాలు సంభవిస్తున్నాయి. అనధికారికంగా ఈ లెక్కలు డబుల్, త్రిబుల్ ఉండొచ్చు.

    ఇక ఇన్నాళ్లు 45 ఏళ్ల పైబడిన వారికి, దీర్ఘకాలిక రోగులకు కేంద్రప్రభుత్వమే ఉచితంగా కరోనా టీకాలు ఇచ్చింది. ఇక ఇప్పుడు ఓపెన్ మార్కెట్ లో కరోనా అమ్మేందుకు కొన్ని కంపెనీలకు అవకాశం ఇచ్చింది.  రాష్ట్రాలు, ప్రైవేటు ఆస్పత్రులు కరోనా టీకాలను కొనేందుకు అవకాశం కల్పిస్తోంది.

    అయితే తెలుగు ప్రజలకు కరోనా టీకాల ఆందోళన తొలిగిపోయింది. ఎందుకంటే మన తెలుగు సీఎంలు కేసీఆర్, జగన్ లు ఇద్దరూ కూడా ఉచితంగా ప్రజలకు వ్యాక్సిన్ వేస్తామని ప్రకటించారు. ఇదో గొప్ప నిర్ణయం అని చెప్పొచ్చు. ఆర్థికంగా చితికి బతుకు భయంతో గడుపుతున్న తెలుగు ప్రజలకు ఉపశమనం లాంటి వార్త ఇదీ.. స్వయంగా ఉచితంగా టీకాలు వేయనున్నట్టు నిన్న ఏపీ సీఎం జగన్ ప్రకటించారు. ప్రజలపై భారం వేయకుండా ప్రభుత్వమే ఈ మొత్తాన్ని భరిస్తుందని జగన్ హామీ ఇచ్చారు.

    జగన్ ప్రకటన చేసిన మరునాడే తెలంగాణ సీఎం కేసీఆర్ ఇక్కడి ప్రజలకు గుడ్ న్యూస్ తెలిపారు. తెలంగాణ ప్రజలందరికీ ఉచిత వ్యాక్సిన్ అందించనున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. 18 ఏళ్లు దాటిన వారందరికీ వ్యాక్సిన్ ఇవ్వనున్నట్టు కేసీఆర్ ప్రకటించారు. వ్యాక్సినేషన్ కోసం ఇప్పటికే అధికారులను ఆదేశించినట్టు పేర్కొన్నారు.

    ఇక తెలంగాణలో వ్యాక్సినేషన్ ను తాను స్వయంగా పర్యవేక్షిస్తానని.. రెండు మూడు రోజుల్లో వైద్య పరీక్షల తర్వాత అధికారులతో సమీక్ష జరుపనున్నట్లు వివరించారు. వ్యాక్సినేషన్ కోసం దాదాపు రూ.2500 కోట్లు ఖర్చు అవుతుందని.. ప్రజల ఆరోగ్యం కంటే డబ్బు ముఖ్యం కాదని కేసీఆర్ స్పష్టం చేశారు.

    ఇక తెలంగాణలోనూ కరోనా కల్లోలం చోటుచేసుకుంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 7432 పాజిటివ్ కేసులు నమోదు కావడం పరిస్తితి తీవ్రతకు అద్దం పడుతోంది. రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే కరోనాతో 33మంది మరణించడం విషాదం నింపింది. 2152మంది నిన్న కరోనా నుంచి కోలుకున్నారు.

    తెలంగాణలో ప్రస్తుతం 58148 యాక్టివ్కేసులున్నాయని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. హైదరాబాద్ పరిధిలో 1464 కేసులు ఉన్నాయి.

    తెలంగాణలో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 3,26,997 మంది ఉన్నట్టు వైద్యఆరోగ్యశాఖ తెలిపింది. ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారితో కలిపితే 387106 మంది తెలంగాణలో కరోనాను జయించినవారు ఉన్నారు.

    వీరిందరికీ కరోనా వ్యాక్సిన్ ఇప్పటికిప్పుడు వేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వారంతా కరోనా నుంచి ఇమ్యూనిటీని సాధించిన వారే ఓ మూడు నెలల తర్వాతనే వారు టీకా వేసుకోవాలి.

    తెలుగు రాష్ట్రాల సీఎంలు దూరదృష్టితో ప్రజా శ్రేయస్సు కోసం కరోనాను ఉచితంగా పంపిణీ చేస్తూ ప్రజల మనసులు చూరగొన్నారు. కరోనా కల్లోలంలో కరోనా మందులకు భారీగా ధరలుపెరిగాయి. వ్యాక్సిన్లు కూడా ప్రైవేటుకు ఇస్తే పేదలు వేసుకునే పరిస్థితి ఉండదు. అదే ప్రభుత్వాలే వేస్తే అందరికీ ఆయా గ్రామాలు, వార్డుల్లోనే టీకాలు అందుతాయి. అదీ కాక ఉచితంగా వేస్తే ప్రజల డబ్బు, సమయం కూడా ఆదా అవుతుంది.

    ఈ కరోనాను జయించాలంటే ప్రజలందరికీ టీకాలు వేయడం తప్పితే మరో పరిష్కారం లేదు. అందుకే సీఎంలు జగన్, కేసీఆర్ లు ఎంత వీలైతే అంత వేగంగా ఈ టీకాలు ప్రజలందరికీ ఉచితంగా వేసి ఆ మహమ్మారి నుంచి ప్రజలందరినీ కాపాడాల్సిన అవసరం ఉంది. అదే చేస్తే ప్రజల్లో ఒక గొప్ప ఆశను నింపినవారు అవుతారు.