https://oktelugu.com/

Nandamuri Balakrishna: ‘వీరసింహారెడ్డి’గా బాలయ్య.. కారణం సెంటిమెంటేనా ?

Nandamuri Balakrishna: నట సింహం బాలయ్య తన 107వ సినిమాని గోపీచంద్ మలినేని దర్శకత్వంలో భారీ స్థాయిలో చేస్తున్నాడు. ప్రస్తుతం మొదటి షెడ్యూల్ షూట్ చేస్తున్నారు. కాగా ఈ సినిమాలో బాలకృష్ణ పాత్ర పేరు ‘వీరసింహారెడ్డి’, ఈ సినిమా టైటిల్ ను కూడా ‘వీరసింహారెడ్డి’గానే పెట్టాలని ఆలోచిస్తున్నారు మేకర్స్. ఎలాగూ ‘సింహా’ అనే టైటిల్ తో బాలయ్యకు ఎప్పటినుంచో హిట్ సెంటిమెంట్ వుంది. బాలకృష్ణ కెరీర్ లో ‘సింహా’ అనే టైటిల్స్ తో వచ్చిన అన్నీ సినిమాలు […]

Written By:
  • Shiva
  • , Updated On : February 21, 2022 / 10:12 AM IST
    Follow us on

    Nandamuri Balakrishna: నట సింహం బాలయ్య తన 107వ సినిమాని గోపీచంద్ మలినేని దర్శకత్వంలో భారీ స్థాయిలో చేస్తున్నాడు. ప్రస్తుతం మొదటి షెడ్యూల్ షూట్ చేస్తున్నారు. కాగా ఈ సినిమాలో బాలకృష్ణ పాత్ర పేరు ‘వీరసింహారెడ్డి’, ఈ సినిమా టైటిల్ ను కూడా ‘వీరసింహారెడ్డి’గానే పెట్టాలని ఆలోచిస్తున్నారు మేకర్స్. ఎలాగూ ‘సింహా’ అనే టైటిల్ తో బాలయ్యకు ఎప్పటినుంచో హిట్ సెంటిమెంట్ వుంది. బాలకృష్ణ కెరీర్ లో ‘సింహా’ అనే టైటిల్స్ తో వచ్చిన అన్నీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బాగా ఆడాయి.

    Nandamuri Balakrishna

    అందుకే ఓల్డ్ గా ఉన్న ‘వీరసింహా రెడ్డి’ అనే టైటిల్ నే ఫిక్స్ చేయాలని గోపీచంద్ మలినేని ఫిక్స్ అయ్యాడట. మొదటి షెడ్యూల్ లో రామ్-లక్ష్మణ్ నేతృత్వంలో బాలయ్య పై యాక్షన్ సీన్స్ తెరకెక్కిస్తున్నారు. ఈ సీక్వెన్స్ లో బాలయ్య లుంగీలో ఊర మాస్ లుక్‌ లో కనిపించబోతున్నాడు. ఈ సినిమా కథ మొత్తం రాయలసీమ – కర్ణాటక బోర్డర్ నేపథ్యంలో జరుగుతుందట.

    Also Read:   సినిమా టికెట్ల వ్యవహారం: జగన్ ను ఆ ఒక్కమాటతో కడిగేసిన పవన్ కళ్యాణ్

    కథలో రాయలసీమకు చెందిన ఓ సామాజిక అంశాన్ని కూడా ప్రముఖంగా ప్రస్తావించ బోతున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా రాయలసీమకి సాగునీటి విషయంలో జరుగుతున్న ఆన్యాయాన్ని సినిమాలో ప్రధానంగా చూపిస్తారట. ఇక బాలయ్యకి జోడీగా శ్రుతి హాసన్ నటించబోతుంది. ఈ సినిమాలో తన పాత్ర కోసం చాలా కసరత్తులు చేస్తోంది. లావు పెరగడానికి తన డైట్ ను మార్చుకుంది.

    Nandamuri Balakrishna

    నిజానికి శృతి హాసన్ కి జీరో సైజ్ అంటేనే ఎక్కువ మక్కువ. కానీ బాలయ్య సినిమా కోసం పూర్తిగా వర్కౌట్స్ మానేసింది. బాలయ్య కోసం సరికొత్త లుక్ లో కనిపించబోతుంది. ఈ సినిమాలో ఆమెది ఒక సాధారణ హౌస్ వైఫ్ పాత్ర. ఆ పాత్రలో బాలయ్య భార్యగా శృతి హాసన్ నటించబోతుంది. ఏది ఏమైనా అరవై ఏళ్ల వయసులో బాలయ్య క్రేజ్ డబుల్ అయింది.

    ఒకప్పుడు స్టార్ డైరెక్టర్లు అంతా బాలయ్యతో సినిమా అనగానే మొహం చాటేసేవాళ్ళు. ఇప్పుడు బాలయ్య డేట్లు కోసం పడిగాపులు కాస్తున్నారు. పైగా చాలా విషయాల్లో బాలయ్య నిర్మాతలకు మంచి లాభదాయకం. రెమ్యునరేషన్ ఎక్కువ ఉండదు. డిమాండ్స్ కూడా పరిధికి మించి దాటవు. ఏ రకంగా చూసుకున్న బాలయ్యతో సినిమా సేఫ్ ప్రాజెక్ట్.

    Also Read:  కేసీఆర్ టూర్ సక్సెసా? ప్రాంతీయ పార్టీలు ఏకం కావాల్సిన అవసరం వచ్చిందా?

    Tags