Ustad Bhagat Singh : పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ టీజర్ విడుదల తేదీ వచ్చేసింది.. ఇక ఫ్యాన్స్ కి పండగే!

వచ్చేనెల 11 వ తేదీతో 'గబ్బర్ సింగ్' అనే సినిమా వచ్చి 11 ఏళ్ళు పూర్తి అవుతాది.ఈ సందర్భంగా 'ఉస్తాద్ భగత్ సింగ్' కి సంబంధించిన చిన్న గ్లిమ్స్ ని సిద్ధం చేసి,

Written By: NARESH, Updated On : April 25, 2023 9:56 pm
Follow us on

Ustad Bhagat Singh : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలలో భారీ అంచనాలు నెలకొల్పిన చిత్రం హరీష్ శంకర్ దర్శకత్వం లో వస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అనే చిత్రం.గబ్బర్ సింగ్ తర్వాత మళ్ళీ వీళ్లిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడం తో ఈ ప్రాజెక్ట్ ప్రకటించిన రోజు నుండే అంచనాలు ఎవ్వరూ ఊహించని రేంజ్ కి చేరుకుంది.

రీసెంట్ గానే రెగ్యులర్ షూటింగ్ ని ప్రారంభించుకున్న ఈ చిత్రం ఒక షెడ్యూల్ ని కూడా పూర్తి చేసుకుంది.త్వరలోనే రెండవ షెడ్యూల్ ని కూడా ప్రారంభించుకోనుంది.అయితే ఈ సినిమాకి సంబంధించి అభిమానులకు పూనకాలు రప్పించే ఒక వార్త సోషల్ మీడియా లో లీక్ అయ్యి వైరల్ గా మారింది.అదేమిటంటే ఈ సినిమాకి సంబంధించిన మొట్టమొదటి గ్లిమ్స్ ని సిద్ధం చేస్తున్నాడట డైరెక్టర్ హరీష్ శంకర్.

వచ్చేనెల 11 వ తేదీతో ‘గబ్బర్ సింగ్’ అనే సినిమా వచ్చి 11 ఏళ్ళు పూర్తి అవుతాది.ఈ సందర్భంగా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి సంబంధించిన చిన్న గ్లిమ్స్ ని సిద్ధం చేసి, అభిమానులకు గిఫ్ట్ గా ఇవ్వబోతున్నాడట డైరెక్టర్ హరీష్ శంకర్.ఈ గ్లిమ్స్ పై అభిమానులు ఎన్ని అంచనాలు పెట్టుకుంటారో అన్ని అంచనాలు పెట్టుకోవచ్చని, ఇది విడుదలైన రోజు సోషల్ మీడియా మొత్తం మోతెక్కిపోతాదని, కనీసం వారం రోజులైనా ఆ గ్లిమ్స్ గురించి మాట్లాడుకునే విధంగా ఉంటుందని రిపోర్ట్స్ అందుతున్నాయి.

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి అసలు సిసలు పండగ ఈ చిత్రమే అవుతుందని,అన్నీ కలిసి వస్తే ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీన గ్రాండ్ గా విడుదల చేస్తారని తెలుస్తుంది.చూడాలిమరి ఈ క్రేజీ కాంబినేషన్ వెండితెర పై ఎలాంటి అద్భుతాలు సృష్టించబోతుందో అనేది.