https://oktelugu.com/

Sai Dharam Tej Father : సాయి తేజ్ నాన్నఒక పెద్ద నిర్మాత అనే విషయం ఎవరికైనా తెలుసా..? అతని బ్యాక్ గ్రౌండ్ చూస్తే ఆశ్చర్యపోతారు!

ఇంత మెగాస్టార్ తో పంజా ప్రసాద్ చేసిన చిత్రం పేరు 'రౌడీ అల్లుడు'.చిరంజీవి మరియు రాఘవేంద్ర రావు కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్.

Written By:
  • NARESH
  • , Updated On : April 25, 2023 / 10:00 PM IST
    Follow us on

    Sai Dharam Tej Father : మెగాస్టార్ చిరంజీవి పేరు తో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఆయన కుటుంబ సభ్యులు నేడు ఒక్కొక్కరు ఏ స్థానం లో ఉన్నారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యూత్ ఐకాన్ గా కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకుంటే,మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నేడు పాన్ వరల్డ్ స్టార్స్ గా సినీ వినీలాకాసం లో ధ్రువతారలు గా ఒక వెలుగు వెలుగుతున్నారు.

    వీళ్ళ తర్వాత ఇండస్ట్రీ కి వచ్చిన సాయి ధరమ్ తేజ్ మరియు వరుణ్ తేజ్ వంటి వారు కూడా ఇండస్ట్రీ లో సక్సెస్ అయ్యారు.అయితే వీరిలో సాయి ధరమ్ తేజ్ గురించి కేవలం మెగాస్టార్ మేనల్లుడిగా మాత్రమే మన అందరికీ తెలుసు.కానీ ఆయన తండ్రి పంజా ప్రసాద్ గురించి చాలా మందికి ఇండస్ట్రీ లో తెలియదు.సాయి ధరమ్ తేజ్ ముందు ఉన్న పంజా అంటే ఏమిటో కూడా మొన్నటి దాకా ఆయన చెప్పేవరకు ఇండస్ట్రీ లో ఎవరికీ తెలియదు.

    అయితే పంజా ప్రసాద్ కూడా ఇండస్ట్రీ లో ఒక పెద్ద నిర్మాత అని, మెగాస్టార్ చిరంజీవి ని పెట్టి ఆయన ఒక సూపర్ హిట్ చిత్రాన్ని నిర్మించాడనే విషయం చాలా మందికి తెలియదు.ఇంత మెగాస్టార్ తో పంజా ప్రసాద్ చేసిన చిత్రం పేరు ‘రౌడీ అల్లుడు’.చిరంజీవి మరియు రాఘవేంద్ర రావు కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమా ఆ రోజుల్లో పెద్ద సెన్సషనల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చింది.

    అప్పట్లోనే ఈ సినిమా సుమారుగా 7 కోట్ల రూపాయిల వరకు షేర్ వసూళ్లను సాధించింది.మెగాస్టార్ చిరంజీవి ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమా ఆ రోజుల్లో ట్రెండ్ సెట్టర్ గా నిల్చింది.ఈ సినిమా సూపర్ హిట్టైన ఉత్సాహం తో మరో రెండు సినిమాలు తీసాడట.కానీ ఆ రెండు పెద్ద ఫ్లాప్ అవ్వడం తో పంజా ప్రసాద్ ఇక సినీ రంగం ని వదిలి వ్యాపార రంగం లోకి అడుగుపెట్టాడని, అందులో గ్రాండ్ సక్సెస్ సాధించి కోట్ల రూపాయిల ఆస్తులు సంపాదించాడని తెలుస్తుంది.