https://oktelugu.com/

Pawan Kalyan Records: పవన్ కళ్యాణ్ రేర్ రికార్డు… కేవలం ఆయనకే సాధ్యం!

వరుసగా పవన్ కళ్యాణ్ మూడు చిత్రాలు వంద కోట్ల వసూళ్లను అధిగమించాయి. కమ్ బ్యాక్ అనంతరం పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్, భీమ్లా నాయక్, వినోదాయ సితం చిత్రాలు చేశారు.

Written By:
  • Shiva
  • , Updated On : August 2, 2023 / 01:54 PM IST

    Pawan Kalyan Records

    Follow us on

    Pawan Kalyan Records: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టాలీవుడ్ టాప్ స్టార్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. అత్యధిక ఫ్యాన్ బేస్ కలిగిన హీరో. ఆయన రీ రిలీజ్ సినిమాలు కూడా కోట్ల రూపాయల షేర్ వసూలు చేస్తాయి. ప్లాప్ సినిమాల పేరిట కూడా భారీ ఓపెనింగ్ రికార్డ్స్ ఉంటాయి. ఆయన తెరపై కనిపిస్తే చాలు పండగ చూసుంటాం అంటారు అభిమానులు. పవన్ కళ్యాణ్ పేరిట అనేక రికార్డ్స్ ఉన్నాయి. అది కేవలం ఆయన స్టామినాతో క్రియేట్ చేసిన రికార్డ్స్. తాజాగా మరో అరుదైన రికార్డు ఆయన నమోదు చేశారు.

    వరుసగా పవన్ కళ్యాణ్ మూడు చిత్రాలు వంద కోట్ల వసూళ్లను అధిగమించాయి. కమ్ బ్యాక్ అనంతరం పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్, భీమ్లా నాయక్, వినోదాయ సితం చిత్రాలు చేశారు. ఈ మూడు చిత్రాలు వంద కోట్ల వసూళ్ళు సాధించాయి. మరో అరుదైన విషయం ఏమిటంటే… ఈ చిత్రాలన్నీ రీమేక్స్. నిజానికి రీమేక్ చిత్రాలపై జనాల్లో అంత హైప్ ఉండదు. ఆల్రెడీ తెలిసిన కథే కావడంతో ప్రేక్షకులు అంతగా ఆసక్తి చూపరు.

    అదే సమయంలో ఈ మూడు కమర్షియల్ చిత్రాలు కూడా కాదు. పవన్ కళ్యాణ్ ఇమేజ్ కి ఏ మాత్రం సెట్ కానీ చిత్రాలు. పింక్ మూవీ రీమేక్ గా వకీల్ సాబ్ తెరకెక్కింది. ఒరిజినల్ లో అమితాబ్ నటించారు. పవన్ కోసం ఫైట్స్, సాంగ్స్ వంటివి జోడించారు. పవర్ ఫుల్ లాయర్ గా చూపించారు. ఒక అయ్యప్పనుమ్ కోశియుమ్ అనే మలయాళ చిత్ర రీమేక్ గా భీమ్లా నాయక్ తెరకెక్కింది. ఇది కూడా కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీ.

    ఇక లేటెస్ట్ హిట్ బ్రో మూవీ వినోదాయసితం రీమేక్. తమిళంలో తంబి రామయ్య, సముద్రఖని చేసి పాత్రలను సాయి ధరమ్ తేజ్, పవన్ కళ్యాణ్ చేశారు. పింక్, అయ్యప్పనుమ్ కోశియుమ్, వినోదాయసితం వంటి ఛాలెంజింగ్ సబ్జక్ట్స్ ఎంచుకుని పవన్ కళ్యాణ్ విజయాలు సాధించారు. రీమేక్ చిత్రాలతో హ్యాట్రిక్ 100 కోట్ల వసూళ్లు నమోదు చేసిన పవన్ కళ్యాణ్ అరుదైన రికార్డు నమోదు చేశారు.