https://oktelugu.com/

Prabhas : పవన్ కళ్యాణ్ సినిమాలోని ఆ పాట అంటే చెవులు కోసేసుకుంటాను అంటూ ప్రభాస్ షాకింగ్ కామెంట్స్..వైరల్ అవుతున్న వీడియో!

కళామ్మ తల్లికి ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ ఈటీవీ ఛానల్ లో 'నా ఉఛ్వాసం కవనం' అనే పేరుతో ఒక ప్రోగ్రాం ని నడుపుతున్నారు. ప్రతీ వారం ఒక కొత్త అతిధి ఈ షోకి విచ్చేసి సిరివెన్నెల సీతారామ శాస్త్రి పనితనం గురించి, ఆయనతో ఉన్నటువంటి అనుబంధం గురించి చెప్తుంటారు. అలా రీసెంట్ గా రెబల్ స్టార్ ప్రభాస్ ఈ షోకి విచ్చేశాడు

Written By:
  • Vicky
  • , Updated On : November 11, 2024 / 03:10 PM IST

    Prabhas

    Follow us on

    Prabhas :  దిగ్గజ గేయ రచయిత సిరి వెన్నెల సీతారామశాస్త్రి మన తెలుగు సినిమా ఇండస్ట్రీ కి అందించిన అద్భుతమైన సాహిత్యం గురించి ఎంత చెప్పినా అది తక్కువే అవుతుంది. ఆయన లేని లోటు స్పష్టంగా కనిపిస్తూనే ఉంది, తన చివరి శ్వాస వరకు సాహిత్యానికే జీవితాన్ని అంకితం చేసిన సీతారామశాస్త్రి సినీ జీవిత ప్రయాణం 1984 వ సంవత్సరంలో విడుదలైన ‘జనని జన్మభూమి’ అనే చిత్రం ద్వారా మొదలైంది. ఆ తరువాత మరుసటి సంవత్సరంలో వచ్చిన ‘సిరివెన్నెల’ చిత్రంలోని పాటలన్నిటికీ సీతారామశాస్త్రి నే సాహిత్యం అందించాడు. అవి పెద్ద హిట్ అవ్వడంతో ‘సిరివెన్నెల ‘ అనేది తన ఇంటి పేరుగా మారిపోయింది. అప్పటి నుండి సీతారామశాస్త్రి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఏడాదికి 20 సినిమాలు చేస్తూ క్షణకాలం తీరిక లేకుండా గడిపేవాడు. ఆయన చనిపోయిన సంవత్సరం 2021 లో కూడా 6 సినిమాలకు సాహిత్యం అందించాడు.

    అలాంటి మహనీయుడిని, కళామ్మ తల్లికి ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ ఈటీవీ ఛానల్ లో ‘నా ఉఛ్వాసం కవనం’ అనే పేరుతో ఒక ప్రోగ్రాం ని నడుపుతున్నారు. ప్రతీ వారం ఒక కొత్త అతిధి ఈ షోకి విచ్చేసి సిరివెన్నెల సీతారామ శాస్త్రి పనితనం గురించి, ఆయనతో ఉన్నటువంటి అనుబంధం గురించి చెప్తుంటారు. అలా రీసెంట్ గా రెబల్ స్టార్ ప్రభాస్ ఈ షోకి విచ్చేశాడు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి తో తనకు ఉన్నటువంటి అనుబంధం గురించి చెప్తూ తన ఆనందాన్ని పంచుకున్నాడు. శాస్త్రి గారు రచించిన పాటల్లో ప్రభాస్ కి పవన్ కళ్యాణ్ ‘జల్సా’ చిత్రంలోని ‘చలోరే చలోరే చల్’ పాట అంటే పిచ్చి ఇష్టమట. ఈ పాట తనకి ఎంత ఇష్టమో ప్రభాస్ చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది.

    ప్రభాస్ మాట్లాడుతూ ‘ జల్సా చిత్రంలోని శాస్త్రి గారు రచించిన చలోరే చలోరే చల్ పాట ఎంత ఇష్టమో మాటల్లో చెప్పలేను. అప్పట్లో నా స్నేహితులతో కలిసి పార్టీలు చేసుకుంటున్నప్పుడు ఈ పాటనే పెట్టేవాడిని. ఆ పాటలోని సాహిత్యాన్ని అర్థం చేసుకోండి, ఎంత అద్భుతంగా ఉంటుందో అని నా స్నేహితులకు చెప్పేవాడిని. నేను చలోరే చలోరే పాట గురించి టాపిక్ తీసినప్పుడల్లా నా స్నేహితులు పారిపోయేవాళ్ళు,వామ్మో వీడు మళ్ళీ మొదలెట్టాడు రా అని. అన్ని సార్లు వాళ్లకు ఆ పాట గురించి చెప్పాను. ఆ పాటలో ప్రతీ లైన్ అద్భుతంగా ఉంటుంది, ఇప్పటికీ నేను వింటూనే ఉంటాను’ అంటూ చెప్పుకొచ్చాడు ప్రభాస్. ఆయన మాట్లాడిన మాటలకు సంబంధించిన వీడియో ని క్రింద అనిస్తున్నాము , మీరు కూడా చూసేయండి. అయితే ప్రభాస్ నోటి నుండి తమ అభిమాన హీరో సినిమాకి సంబంధించి గొప్ప మాటలు రావడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ వీడియో ని సోషల్ మీడియా లో షేర్ చేసి తమ ఆనందాన్ని పంచుకుంటున్నారు.