Akira Nandan : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘గేమ్ చేంజర్’ చిత్రం మరో నాలుగు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ నేడు కొన్ని ప్రాంతాలలో మొదలైంది. రామ్ చరణ్ కి కంచుకోట గా పిలవబడే కదిరి లో మొదట అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభించారు. టికెట్ రేట్స్ రెగ్యులర్ షోస్ కి 300 రూపాయిల రేంజ్ లో ఉంది. అదే విధంగా అనంతపురం బెనిఫిట్ షోస్ టికెట్స్ కూడా అమ్ముడుపోయాయి. ఒక్కో బెనిఫిట్ షో టికెట్ ధర ఇక్కడ 1500 రూపాయిలు ఉంది. రేపు కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు అవ్వబోతున్నాయి. తెలంగాణ ప్రాంతంలో మంగళవారం నుండి మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ టికెట్ హైక్స్, బెనిఫిట్ షోస్ ఉంటాయా లేవా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ఇది ఇలా ఉండగా నిన్న రాజమండ్రి లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇచ్చిన ప్రసంగం సినిమా మీద హైప్ విపరీతంగా పెంచేలా చేసింది. ఈ ఈవెంట్ కి అకిరా నందన్ కూడా వచ్చాడు కానీ, సభా ప్రాంగణం కి మాత్రం రాలేదు. నిన్న రాత్రి ఆయన రామ్ చరణ్ తో కలిసి ఇంటికి తిరిగి వెళ్తున్న సమయంలో రాజమండ్రి విమానాశ్రయంలో కనిపించాడు. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. అకిరా చేతిలో పుస్తకం ఉండడం గమనించాల్సిన విషయం. ఎందుకంటే అకిరా నందన్ కి ఆయన తండ్రి పవన్ కళ్యాణ్ కి ఉన్నట్టుగానే పుస్తకాలు చదివే అలవాటు ఎక్కువగా ఉంది. ఈయన కారణంగా నాకు కూడా పుస్తకాలు చదివే అలవాటు వచ్చిందని రామ్ చరణ్ ఒక సందర్భం లో చెప్తాడు.
ఈ వీడియో ని చూసిన అభిమానులు చిరంజీవి తర్వాత పవన్ కళ్యాణ్ ఆయన లేజసి ని ఎలా అయితే కొనసాగించాడో, ఇప్పుడు రామ్ చరణ్ అలా కొనసాగిస్తున్నాడు. రామ్ చరణ్ తర్వాత మెగా లేజసి ని కొనసాగించేది కేవలం అకిరా నందన్ మాత్రమే అని సోషల్ మీడియా లో పోస్టులు పెడుతున్నారు. ప్రస్తుతం అకిరా నందన్ హైదరాబాద్ లోని పవన్ కళ్యాణ్ గురువు సత్యానంద్ వద్ద శిష్యరికం చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. 2029 సార్వత్రిక ఎన్నికల లోపు అకిరా నందన్ టాలీవుడ్ లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు అభిమానులు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తన ద్రుష్టి మొత్తం రాజకీయాలపైనే పెట్టడం వల్ల, సినిమాల మీద పెద్దగా ఫోకస్ చేయడం లేదు. దీంతో భవిష్యత్తులో ఆయన వైభోగం ని అకీరానందన్ సినిమాల పరంగా కొనసాగించాలని అభిమానులు కోరుకుంటున్నారు.
రాజమండ్రిలో రామ్ చరణ్ తో కలిసి పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా నందన్ సందడి..
pic.twitter.com/61Q6hPfjyD— Narendra News (@Narendra4News) January 5, 2025