Hari Hara Veeramallu-Puspa 2 : ఈమధ్య కాలం లో సినిమాటిక్ యూనివర్స్ లు ఎక్కువ అయిపోతున్న సంగతి అందరికీ తెలిసిందే. హాలీవుడ్ లో ఇలాంటివి సర్వసాధారణం. మన ఇండియన్ సినిమాలో సీక్వెల్స్ ఉన్నాయి కానీ, ఇలా ఒక సినిమాకి మరో లింక్ ఉండడం వంటివి తమిళ దర్శకుడు లోకేష్ పరిచయం చేసాడు. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ ద్వారా ఆయన తెరకెక్కిస్తున్న సినిమాలకు యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉంది. తెలుగు లో కూడా అలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు కానీ కార్యరూపం దాల్చేందుకు సమయం పడుతుంది. ఇదంతా పక్కన పెడితే సినిమాటిక్ యూనివర్స్ కాదు కానీ, ‘హరి హర వీరమల్లు’ చిత్రానికి, ‘పుష్ప 2 ‘ చిత్రానికి చాలా దగ్గర సంబంధం ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో గత కొద్దిరోజులుగా ఒక వార్త చక్కర్లు కొడుతోంది. ‘హరి హర వీరమల్లు’ చిత్రంలో పవన్ కళ్యాణ్ రాబిన్ హుడ్ తరహా పాత్ర పోషిస్తున్నాడు. రాబిన్ హుడ్ అంటే ధనవంతుల దగ్గర డబ్బులు దోచేసి, పేదలకు పంచి పెట్టడం. ‘పుష్ప 2’ చిత్రంలో అల్లు అర్జున్ క్యారక్టర్ కూడా అలాంటిదే.
ఎర్ర చందనం స్మగ్లింగ్ చేసి, అందులో వచ్చిన డబ్బులను పేదలకు పంచుతూ ఉంటాడు. ఇది గ్లిమ్స్ వీడియో ద్వారా సుకుమార్ అందరికీ సినిమా స్టోరీ ఎలా ఉండబోతుంది అనేది చెప్పేసాడు. గతంలో ఈ స్టోరీ లైన్ మీద చాలా సినిమాలు వచ్చాయి, అవి కమర్షియల్ గా సూపర్ హిట్స్ కూడా అయ్యాయి. కానీ ఈమధ్య కాలం లో ఇలాంటి సినిమాలు రాలేదు. చాలా కాలం తర్వాత టచ్ చేసిన కాన్సెప్ట్ కాబట్టి ఈ రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద దున్నేసే అవకాశాలు ఉన్నాయి. రెండు ఒకే కథాంశం తో తెరకెక్కుతున్నాయి కాబట్టి, సినిమాటిక్ యూనివర్స్ గా చూపిస్తే బాగుండును అని అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ అభిమానులు కోరుకుంటున్నారు. కానీ అది ప్రాక్టికల్ గా అసాధ్యం. ఇది ఇలా ఉండగా ‘పుష్ప 2 : ది రూల్’ చిత్రం ఈ ఏడాది డిసెంబర్ 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్లో గ్రాండ్ గా విడుదల కానుంది.
ముందుగా 6వ తేదీన విడుదల చేద్దామని అనుకున్నారు కానీ, లాంగ్ వీకెండ్ కలెక్షన్స్ కోసం ఒక రోజు ముందుకు వెళ్లారు. ఇక పవన్ కళ్యాణ్ ‘హరి హర వీరమల్లు’ చిత్రం షూటింగ్ అనేకమార్లు వాయిదా పడుతూ ఎట్టకేలకు ఈమధ్యనే షూటింగ్ ని తిరిగి ప్రారంభించుకుంది. ఈ నెల 31వ తారీఖు తో షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకోనున్న ఈ చిత్రం, వచ్చే ఏడాది మార్చి 28 వ తారీఖున విడుదల కాబోతుంది. ఈ రెండు సినిమాల పై అభిమానుల్లో, ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతానికి ‘హరి హర వీరమల్లు’ కంటే ‘పుష్ప 2’ చిత్రం మీదనే భారీ అంచనాలు ఉన్నాయి. కేవలం ప్రీ రిలీజ్ బిజినెస్ తోనే వెయ్యి కోట్ల రూపాయిల ని ముట్టుకున్న ఈ చిత్రం, విడుదల తర్వాత ఎంత వసూళ్లను రాబడుతుందో చూడాలి.