OG North America Release: మరో రెండు రోజుల్లో పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) హీరో గా నటించిన ‘ఓజీ'(They Call Him OG) చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదల కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ అన్ని ప్రాంతాల్లో మొదలయ్యాయి కానీ, పూర్తి స్థాయిలో మాత్రం బుకింగ్స్ ప్రారంభం కాలేదు. నేడు సాయంత్రం నుండి మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. కచ్చితంగా ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రికార్డు కొడుతోంది అనే బలమైన నమ్మకం తో ఫ్యాన్స్ ఉన్నారు కానీ, జరగాల్సిన పనులు సరైన రీతిలో జరగడం లేదు. ఆ కారణం చేత ఓవర్సీస్ లోని అనేక దేశాల్లో ప్రీమియర్ షోస్ రద్దు అవుతున్నాయి. ఉదాహరణకు సౌత్ అమెరికా దేశం లోని కెనడా లో అడ్వాన్స్ బుకింగ్స్ ని యోర్క్ మూవీస్ సంస్థ బ్యాన్ చేయడం ఇప్పుడు సోషల్ మీడియా లో సంచలనంగా మారింది.
ఈ సందర్భంగా యోర్క్ సంస్థ ఒక లేఖని విడుదల చేసింది. ఆ లేఖలో ఏముందంటే ‘మా థియేటర్స్ లో ‘ఓజీ’ చిత్ర ప్రదర్శన నిలిపివేయాలని కఠినమైన నిర్ణయం తీసుకున్నందుకు చింతిస్తున్నాము. ఈ సినిమా సౌత్ అమెరికా లో డిస్ట్రిబ్యూట్ చేస్తున్న సంస్థ కారణంగా అనేక అల్లర్లు జరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. అందుకే మా థియేటర్స్ కి వచ్చే ప్రేక్షకులకు ఇబ్బంది కలిగించడం ఇష్టం లేక ఈ నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చింది. ఈ అసౌకర్యానికి మేము చింతిస్తున్నాము. అంతే కాకుండా ఈ సినిమాని డిస్ట్రిబ్యూట్ చేసే వ్యక్తి తో గతం లో కూడా మేము చాలా సమస్యలు ఎదురుకున్నాము. అప్పట్లో వచ్చిన కలెక్షన్స్ కంటే మాకు ఎక్కువ డబ్బులు చూపించి అవి ఇవ్వాలని అడిగేవాడు. మేము అందుకు ఒప్పుకోలేదు. ఇప్పుడు కూడా అతను అదే ధోరణి తో వ్యవహరిస్తున్నాడు. రాబోయే రోజుల్లో మేము అతనితో ఎలాంటి సినిమా డిస్ట్రిబ్యూషన్ చెయ్యము’ అంటూ చెప్పుకొచ్చాడు.
దీనిపై వైసీపీ పార్టీ శ్రేణులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఇంతకంటే సిగ్గు చేటు ఇంకోటి ఉండదని, ఓజీ డిస్ట్రిబ్యూటర్ కారణంగా ప్రజల భద్రతకు ముప్పు కలుగుతుందని థియేటర్స్ యాజమాన్యం షోస్ ని రద్దు చేసారని, ఇలా తెలుగు సినిమా ఇండస్ట్రీ హిస్టోరు లో ఏ సినిమాకు కూడా జరగలేదట. అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా అభిమానులు కెనడా లో రెండు లక్షల డాలర్ల వరకు ఇచ్చారు. ఇప్పుడు అదంతా క్యాన్సిల్ అయ్యినట్టే. కెనడా లో యోర్క్ సినిమాస్ అతి పెద్ద చైన్. మన ఇండియన్ సినిమాలకు అత్యధిక గ్రాస్ వసూళ్లు వస్తుంటాయి. అలాంటి థియేటర్స్ గ్రూప్ ఓజీ చిత్రాన్ని నిషేధించడం పెద్ద దెబ్బ అనే చెప్పాలి. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.