Meher Ramesh- Pawan Kalyan: సినిమాల్లోకి రీ ఎంట్రీ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఊపు ఎలా ఉందొ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..ఆయన హీరో గా నటించిన వకీల్ సాబ్ మరియు భీమ్లా నాయక్ వంటి సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించాయి..రీమేక్ సినిమాలు అయ్యినప్పటికీ OTT కాలం నడుస్తున్నప్పటికీ కూడా ఈ రెండు సినిమాలు ఎన్నో అడ్డంకులను విజయవంతంగా దాటుకొని పవన్ కళ్యాణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి.

ఈ రెండు సినిమాల తర్వాత పవన్ కళ్యాణ్ క్రిష్ దర్శకత్వం లో ‘హరిహరవీరమల్లు’ అనే సినిమా చేస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే..భారీ బడ్జెట్ తో AM రత్నం ఈ సినిమాని కనివిని ఎరుగని రేంజ్ లో తెరకెక్కిస్తున్నాడు..ఇప్పటికే 50 శాతం కి పైగా షూటింగ్ ని జరుపుకున్న ఈ చిత్రం..సరికొత్త షెడ్యూల్ ని ఈ నెలలోనే ప్రారంబించుకోనుంది..దీనికి సంబంధించిన భారీ సెట్స్ ని అన్నపూర్ణ స్టూడియోస్ లో ఇటీవలే వేశారు..ఈ షెడ్యూల్ లో పవన్ కళ్యాణ్ మీద భారీ యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కిస్తారట.
ఎట్టిపరిస్థితిలో కూడా ఈ సినిమా షూటింగ్ డిసెంబర్ లోపు పూర్తి చేసి సమ్మర్ కానుకగా పాన్ ఇండియా లెవెల్ లో తెలుగు, తమిళం, హిందీ , మలయాళం బాషలలో ఘనంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు..ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ తో భవదీయుడు భగత్ సింగ్ మరియు సురేందర్ రెడ్డి తో మరో సినిమా ఒప్పేసుకున్నాడు..వీటితో పాటు ప్రముఖ దర్శకుడు సుజీత్ తో కూడా ఒక సినిమా చెయ్యబోతున్నాడు అంటూ వార్తలు వచ్చాయి..అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో వరుస డిజాస్టర్ ఫ్లాప్ సినిమాలు ఉన్న డైరెక్టర్ మెహర్ రమేష్ ఒక సినిమా కళ్యాణ్ బాబు తో కచ్చితంగా తీస్తాను అంటూ ఇటీవలే జరిగిన ఒక ఇంటర్వ్యూ లో తెలిపాడు.

ఆయన చేసిన ఈ ప్రకటన ఫాన్స్ లో అలజడి రేపుతోంది..మంచి ఊపు మీద మా హీరో సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు..సక్సెస్ లు వస్తున్నాయి..దయచేసి మా హీరో తో సినిమాలు చెయ్యకు అంటూ మెహర్ రమేష్ ని టాగ్ చేసి అభిమానులు వేడుకుంటున్నారు..ఎందుకంటే మెహర్ రమేష్ గతం లో తీసిన కళాకండాలు అలాంటివి మరి..ఒక్క బిల్లా మినహా కెరీర్ లో చెప్పుకోదగ్గ సినిమా ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు..ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి తో భోళా శంకర్ అనే సినిమా చేస్తున్నాడు మెహర్ రమేష్..ఈ సినిమా ఎలా ఉంటుందో అని అభిమానులు భయపడుతుంటే ఇంతలోపే పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తాను అని అనడం మెగా ఫాన్స్ ని మరింత కలవరం పెడుతుంది.