Manchu Vishnu- Sunny Leone: యూత్ లో సన్నీ లియోన్ కి ఉన్న క్రేజ్ మామూలుది కాదు..ఆమె డేట్స్ మన టాలీవుడ్ హీరోలకు పట్టుకోవడం కష్టమే ఏమో కానీ..మంచు హీరోలకు మాత్రం కష్టం కాదనే చెప్పొచ్చు..గతం లో మంచు మనోజ్ హీరో గా తెరకెక్కిన ‘కరెంటు తీగ’ అనే సినిమాలో చిన్న పాత్ర పోషించింది సన్నీ లియోన్..అప్పటికే ఆమె డర్టీ పిక్చర్ వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ తో ఇండియా లో వంద కోట్ల రూపాయలకు కొల్లగొట్టిన హీరోయిన్స్ లో ఒకరిగా నిలిచింది..అంత క్రేజ్ ని ఎంజాయ్ చేస్తున్న సన్నీ లియోన్ , మంచు మనోజ్ సినిమాలో ఉండడం చూసిన ప్రేక్షకులు షాక్ కి గురైయ్యారు.

ఆమె ఆ సినిమాలో ఉండడం వల్ల కలెక్షన్స్ కూడా బాగా వచ్చాయి..ఓపెనింగ్స్ అదిరిపోయాయి..ఇప్పుడు ఆమెని మంచు విష్ణు తన జిన్నా సినిమా కోసం తీసుకొచ్చాడు..ఈ సినిమాలో ఆమె ఒక హీరోయిన్ గా నటించింది..అన్నయ్య మనోజ్ కి కలిసి వచినట్టుగానే తనకి కూడా సన్నీ లియోన్ తన సినిమాలో ఉండడం వల్ల కలెక్షన్స్ వస్తుంది అని అనుకున్నాడు విష్ణు.
యూత్ లో జిన్నా సినిమాకి క్రేజ్ తీసుకొచ్చేందుకు మొదటి నుండి సన్నీ లియోన్ ని ప్రొమోషన్స్ లో, పోస్టర్స్ లో మరియు ప్రోమోస్ లో హైలైట్ చేస్తూ వచ్చింది మూవీ టీం..సినిమాలో కూడా సన్నీ లియోన్ పాత్రనే హైలైట్ గా నిలిచింది..కానీ కలెక్షన్స్ మాత్రం నిల్..మొన్న దీపావళి కానుకగా విడుదలైన ఈ సినిమా కనీసం 40 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను కూడా రాబట్టలేకపోయింది.

అయితే ఈ సినిమాలో నటించినందుకు గాను సన్నీ లియోన్ కి ఒక విలువైన బహుమతిని ఇచ్చాడట మంచు విష్ణు..లండన్ లో ఆమె కోసం ప్రత్యేకంగా ఒక డైమండ్ నెక్లెస్ ని చేయించి ఇటీవలే ఆమెకి బహుమతిగా ఇచ్చాడట..దీని విలువ సుమారు 3 కోట్ల రూపాయిలు ఉంటుందని చెప్తున్నారు..ఇక ఈ సినిమాలో నటించిన మరో క్రేజీ హీరోయిన్ పాయల్ రాజ్ పుట్ కి కూడా పారితోషికంగా బలంగానే ఇచ్చినట్టు సమాచారం..వీళ్ళు కాకుండా మిగిలిన తారాగణం కూడా పెద్దదే..అలా మంచు విష్ణు తన మార్కెట్ రేంజ్ కి మించే ఈ సినిమాకి ఖర్చుపెట్టి తీసాడు..కానీ కనీస స్థాయి వసూళ్లు కూడా రాకపోవడం విచారకరం.