Billa Special Shows: ఈ ఏడాది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ప్రపాంచవ్యాప్తంగా ఆయన అభిమానులు పవన్ కళ్యాణ్ కెరీర్ లో సూపర్ హిట్ గా నిలిచినా జల్సా సినిమా ని స్పెషల్ షోస్ గా వేసుకున్న సంగతి మన అందరికి తెలిసిందే..సుమారు 750 షోస్ కి పైగా ప్రదర్శితమైన ఈ సినిమాకి దాదాపుగా 3 కోట్ల 20 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి..అప్పటికే ఆల్ టైం రికార్డు గా ఉన్న పోకిరి కోటి 70 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్ల రికార్డు ని డబుల్ మార్జిన్ తో కొట్టింది జల్సా.

ఈ రికార్డుని ప్రభాస్ ఫాన్స్ బిల్లా సినిమా స్పెషల్ షోస్ తో కొట్టేస్తారని అందరూ అనుకున్నారు..కానీ జల్సా ని కాదు కదా కనీసం పోకిరి రికార్డు కి కూడా దరిదాపుల్లోకి రాలేకపోయింది..అయితే ఈ సినిమా స్పెషల్ షోస్ వేసుకునే సమయం లోనే నాలుగు కొత్త సినిమాలు విడుదల అవ్వడం పెద్ద మైనస్ అయ్యింది.
జల్సా మరియు పోకిరి సినిమాలకు కొన్ని ప్రాంతాలలో ఉదయం ఆటలతో పాటుగా ఫస్ట్ షోస్ మరియు సెకండ్ షోస్ కూడా పడ్డాయి..కానీ బిల్లా సినిమాకి కేవలం ఉదయం 8 గంటల ఆటలే పడ్డాయి..కేవలం తెలంగాణాలో మాత్రమే కాదు..ఆంధ్ర ప్రదేశ్ లో కూడా ఇదే పరిస్థితి..అయితే ఆదివారం అవ్వడం తో ప్రతి చోట హౌస్ ఫుల్ బోర్డ్స్ పడ్డాయి..ప్రభాస్ ఫాన్స్ సంబరాలతో హోరెత్తించేసారు..కానీ ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా స్పెషల్ షోస్ కి కేవలం 80 – 90 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు మాత్రమే వచ్చాయి.

ఇక అమెరికా లో కూడా ఈ సినిమాకి వచ్చిన వసూళ్లు చాలా తక్కువ..శనివారం రోజు అమెరికా లో సినిమాలకు కలెక్షన్స్ అద్భుతంగా వస్తాయి అనే విషయం మన అందరికి తెలిసిందే..బిల్లా సినిమాకి అన్ని ప్రైమ్ టైం షోస్ పడ్డాయి..కానీ కేవలం 14 వేల డాలర్లు మాత్రమే వచ్చాయి.
అమెరికాలో ఇప్పటి వరుకు అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 3 చిత్రాలుగా చెన్నకేశవ రెడ్డి, జల్సా మరియు పోకిరి సినిమాలు మాత్రమే ఉన్నాయి..బిల్లా సినిమా టాప్ 4 స్థానం కి మాత్రమే పరిమితం అయ్యింది..వరల్డ్ వైడ్ కలెక్షన్స్ పరంగా చూసుకుంటే జల్సా నే ప్రస్తుతానికి ఆల్ టైం నెంబర్ 1 మూవీ గా కొనసాగుతుంది..ఈ రికార్డు ని ఎవరు కొట్టబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారింది.