Bhavadiyudu Bhagat Singh : ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ లో కనీవినీ ఎరుగని కంబ్యాక్ మూవీ ఏదైనా ఉందా అంటే అది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన ‘గబ్బర్ సింగ్’ అని చెప్పొచ్చు ..ఇక పవన్ కళ్యాణ్ కి రికార్డ్స్ ని తిరగరాసే సినిమా వస్తుందా రాదా అని అభిమానులందరూ నిరాశ చెందుతున్న సమయం లో వచ్చిన ఈ చిత్రం టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ అన్నిటిని బద్దలు కొట్టి సరికొత్త చరిత్ర సృష్టించింది..ఇప్పటికి ఏ స్టార్ హీరో కంబ్యాక్ ఇచ్చినా అది పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సినిమాతోనే పోలుస్తారు.

ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సృష్టించిన ప్రకంపనలు అలాంటివి మరి..డైరెక్టర్ హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ మీద ఉన్న అభిమానం మొత్తాన్ని ఈ సినిమా టేకింగ్ విషయం లో చూపించాడు..మళ్ళీ హరీష్ శంకర్ తో ఎప్పుడు సినిమా పడుతుందా అని ఎదురు చూస్తున్న అభిమానులకు ‘భవదీయుడు భగత్ సింగ్’ ప్రాజెక్ట్ ని అధికారికంగా ప్రకటించడం తో ఫాన్స్ ఆనందానికి హద్దులే లేకుండా పోయింది.
అధికారిక ప్రకటన అయితే చేసారు కానీ..ఇప్పటి వరుకు ఈ సినిమా ప్రారంభానికి నోచుకోలేకపోయింది..పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ అవ్వడం తో పాటుగా..మధ్యలో భీమ్లా నాయక్ సినిమా ఒప్పుకోవడం తో ఎప్పుడో మొదలవ్వాల్సిన ఈ చిత్రం వాయిదాపడుతూ వచ్చింది..ఈమధ్యనే ఈ ప్రాజెక్ట్ అట్టకెక్కిందని..డైరెక్టర్ హరీష్ శంకర్ వేరే ప్రాజెక్ట్ కి షిఫ్ట్ అయ్యాడంటూ వార్తలు వినిపించాయి..అలాంటి వార్తలన్నిటికీ తెరదించుతూ ఈ సినిమా షూటింగ్ డిసెంబర్ నుండి ప్రారంభం కానుంది అనే వార్త ఇప్పుడు ఫాన్స్ ని పండగ చేసుకునేలా చేస్తుంది..డిసెంబర్ మొదటి వారం లో పూజా కార్యక్రమాలని జరుపుకొని..డిసెంబర్ నెల చివర్లో కానీ..లేదా జనవరి మొదటి వారం లో కానీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతుందట..దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటించబోతుంది.
ఈ చిత్రం ప్రారంభోత్సవానికి సంబంధించిన అధికారిక ప్రకటన ఈ వారం లోనే మైత్రి మూవీ మేకర్స్ వారు ట్విట్టర్ ద్వారా తెలియచేయనున్నారు..పవన్ కళ్యాణ్ రెగ్యులర్ షూటింగ్ కి ఎప్పుడెప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా అని హరీష్ శంకర్ మూడేళ్ళ నుండి ఎదురు చూస్తున్నాడు..మొత్తానికి ఆయన ఎదురు చూపులకు ఇక తెరపడినట్టే.