Jalsa Movie Heroine: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు ఇండస్ట్రీకి పరిచయమవుతుంటారు. కొంత మంది సక్సెస్ లేక ఇండస్ట్రీ నుంచి ఫేడ్ ఔట్ అయిపోతూ ఉంటారు. మరి అలాంటి క్రమంలో చాలామంది హీరోయిన్లు ప్రస్తుతం ఇండస్ట్రీ ని వదిలి వెళ్లిపోయిన విషయం మనకు తెలిసిందే… అందులో కొంతమంది ఇప్పటికీ మళ్ళీ రీఎంట్రీ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. మరికొందరైతే రీ ఎంట్రీ ఇచ్చి అందులో కూడా సక్సెస్ సాధించి ముందుకు దూసుకెళ్తున్నారు.
మరి ఇలాంటి క్రమంలోనే పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన జల్సా సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించిన పార్వతి మెల్టన్ మనందరికీ బాగా పరిచయం ఉన్న హీరోయిన్..అయితే ఈమె ఆ తర్వాత అల్లరే అల్లరి, మధు మాసం లాంటి సినిమాల్లో నటించినప్పటికీ ఆమె ఆశించిన మేరకు సక్సెస్ అయితే సాధించలేకపోయింది. అందువల్లే ఆమె ఇండస్ట్రీ నుంచి తొందరగా ఫేడ్ అవుట్ అయిపోవాల్సిన అవసరమైతే వచ్చింది. ఇక మొదట ఈమె వెన్నెల అనే సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో త్రివిక్రమ్ జల్సా సినిమాలో సెకండ్ హీరోయిన్ గా అవకాశమైతే ఇచ్చాడు.
ఇక హీరోయిన్ గా అవకాశాలు తగ్గిపోయినప్పుడు శ్రీను వైట్ల దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా వచ్చిన దూకుడు సినిమాలో స్పెషల్ సాంగ్ లో నటించే అవకాశం అయితే వచ్చింది.
ఇక మొత్తానికైతే ఆమెకు దాని ద్వారా కూడా పెద్దగా అవకాశాలైతే రాలేదు. దాంతో ఆమె ఇండస్ట్రీ నుంచి ఫేడౌట్ అయిపోయింది. ఇక 2013 వ సంవత్సరంలో శాంసులాలాని అనే వ్యక్తిని పెళ్లి చేసుకొని అమెరికాలో సెటిల్ అయింది. ఇక ప్రస్తుతం ఆమె అమెరికా లోనే ఉంటున్నారు.
అయితే రీసెంట్ గా ఆమె సోషల్ మీడియాలో తన ఫోటోని అప్లోడ్ చేసింది. ఇక దాన్ని చూసిన చాలా మంది జనాలు తర్వాత పార్వతి మెల్టన్ కొంచెం బొద్దుగా, ముద్దుగా ఉండేది ఈవిడెంటి మరీ చాలా సన్నగా మారిపోయింది. అసలు ఈమె పార్వతి గారేనా లేదా వేరే వాళ్ళ అంటూ ఆమె అభిమానులు కూడా ఆమె ఫోటో ను చూసి నమ్మలేకపోతున్నారు…