Nagababu: గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియా లో ఎక్కడ చూసిన శివాజీ(Sivaji) అనే పేరు తప్ప మరొకటి కనిపించడం లేదు. ఆయన ప్రధాన పాత్ర పోషించిన లేటెస్ట్ చిత్రం ‘దండోరా'(Dandora Movie) ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్స్ డ్రెస్సింగ్ పై చేసిన వ్యాఖ్యలు చిలికి చిలికి గాలి వాన లాగా మారినట్టు, రోజురోజుకి ఈ వివాదం పెద్దది అవుతూ ముందుకు పోతూనే ఉంది. శివాజీ నిన్న మహిళా కమీషన్ కి వెళ్లి తన వెర్షన్ ని వివరించుకోవాల్సి వచ్చింది. ఒక సామాన్య కుటుంబ సభ్యుడి ఆలోచన ఎలా ఉంటుందో,శివాజీ చెప్పిన మాటలు కూడా అలాగే ఉన్నాయి. ఇప్పుడు మనం ఇంట్లో కూర్చొని టీవీ షోస్ చూస్తున్నప్పుడు టీవీ యాంకర్లు పొట్టి దుస్తులు వేసుకొని వస్తే, ఈ అమ్మాయికి ఏమి పొయ్యేకాలం, మంచి బట్టలు వేసుకొని రావొచ్చు కదా? అని అనుకుంటారా లేదా?.
శివాజీ కూడా అలా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ చీరలోనే అందం ఉంది, సామాన్లు కనిపించేలా వేసుకునే పొట్టి దుస్తుల్లో లేదు, చక్కగా చీర కట్టుకొని పబ్లిక్ ఈవెంట్స్ కి వెళ్ళండి అంటూ మాట్లాడాడు. దీని పై ఇప్పుడు పెద్ద రాద్ధాంతం నడుస్తుంది. సామాన్లు అనే పదం ఉపయోగించడం తప్పే, అందుకు ఆయన క్షమాపణలు కూడా చెప్పాడు. పైన చెప్పిన దాంట్లో తప్పేమి ఉంది?, అది తన అభిప్రాయం కదా?, దీనిని ఎందుకు ఇంత లాగుతున్నారు అనేదే సోషల్ మీడియా లో నెటిజెన్స్ నుండి ఎదురు అవుతున్న ప్రశ్న. యాంకర్ అనసూయ, రామ్ గోపాల్ వర్మ, పాయల్ రాజ్ పుత్, లావణ్య త్రిపాఠి, మంచు మనోజ్ , ,మంచు లక్ష్మి, ఇలా ఒక్కరా ఇద్దరా, ఎంతో మంది ఈ విషయం పై స్పందించారు. వీరితో పాటు నిన్న శాసన మండలి సభ్యుడు, ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) సోదరుడు కొణిదెల నాగబాబు(Nagababu Konidela) కూడా స్పందించాడు.
ఆయన ఏకంగా 14 నిమిషాల నిడివి ఉన్న వీడియో ని విడుదల చేసి తన ఆవేశాన్ని బయటపెట్టాడు. తన అభిప్రాయాన్ని చెప్పడం లో తప్పు లేదు, కానీ నీకున్నట్టుగానే శివాజీ కి కూడా ఒక అభిప్రాయం ఉంటుంది కదా, ఇప్పుడు ఆయనని తప్పుబట్టాల్సిన అవసరం ఏముంది?. రాజకీయాల్లో ఉన్నావు, రేపో మాపో మంత్రి కూడా అవ్వబోతున్నావు. దేశం లో , రాష్ట్రంలో ఎలాంటి సమస్యలు లేనట్టు, నీకు దీనిపైనా స్పందించాలని అనిపించిందా?, రీసెంట్ గా బాంగ్లాదేశ్ లో దీపు చంద్ర దాస్ అనే హిందువుని అమానుషంగా కొట్టి చంపి, కాల్చేశారు. ఆ అంశం పైన మాట్లాడావా?, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆడవాళ్లపై రోజు రోజుకి దారుణాలు జరుగుతున్నాయి, వాటిపైన స్పందించావా?, ఎందుకు శివాజీ కామెంట్స్ మీదనే రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది?, అంత అవసరం ఏముంది? అంటూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నాగబాబు పై మండిపడుతున్నారు. ప్రతీసారీ ఇలా అనవసరమైన విషయాల్లో దూరడం, నెగిటివిటీ ని పెంచుకోవడం తప్ప నాగబాబు చేస్తున్నది ఏమి లేదంటూ పవన్ ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు.