https://oktelugu.com/

Pawan Kalyan’s BRO : ‘బ్రో’ చిత్రం లో పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఏ నిమిషం లో ఉండబోతుందో లీక్ అయిపోయింది..గెటప్ చూస్తే మెంటలెక్కిపోతారు!

పవన్ కళ్యాణ్ ఇందులో దేవుడిగా కనిపించబోతున్నాడు. శివుడి లోని ముఖ్యమైన అంశం, కాలాంతక శివుడి గా పవన్ కళ్యాణ్ ఇందులో కనిపిస్తాడు.

Written By: , Updated On : June 24, 2023 / 09:17 PM IST
Pawan Kalyan Bro Movie

Pawan Kalyan Bro Movie

Follow us on

Pawan Kalyan’s BRO : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన ‘బ్రో ది అవతార్’ మూవీ వచ్చే నెల 28 వ తారీఖున విడుదల అవ్వబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ మరియు మోషన్ పోస్టర్స్ ని రీసెంట్ గానే విడుదల చేసారు. ఇప్పుడు అభిమానులతో పాటుగా ప్రేక్షకులు కూడా ఈ సినిమా టీజర్ కోసం ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తూ ఉన్నారు.

టీజర్ వర్క్ మొత్తం పూర్తి అయ్యిందట. మరో రెండు రోజుల్లో టీజర్ విడుదల తేదీని ప్రకటిస్తారు, ఈ టీజర్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లో మామూలు ఊపు తీసుకొని రాదని అంటున్నారు ఈ చిత్రం లో పని చేసే యూనిట్ సభ్యులు. పవన్ కళ్యాణ్ ని ఇంత స్టైలిష్ గా చూసి చాలా కాలం అయ్యింది. అంతే కాకుండా ఈ చిత్రం లో ఆయన కామెడీ టైమింగ్ వేరే లెవెల్ లో ఉంటుందట.

ఇకపోతే పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో కేవలం 15 నిముషాలు మాత్రమే కనిపిస్తాడని ఒక రూమర్ సోషల్ మీడియా లో ప్రచారం అయ్యేది. కానీ అదంతా పూర్తిగా ఫేక్ అట. ఈ సినిమా మొత్తం ఆయన కనిపిస్తాడని అంటున్నారు. సినిమా ప్రారంభమై 17 నిమిషాల తర్వాత ఆయన ఎంట్రీ ఉంటుంది. అప్పటి నుండి చివరి వరకు ఉంటాడట ఈ సినిమాలో.

ఇక పవన్ కళ్యాణ్ తో పాటుగా ఈ సినిమాలో ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కూడా నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ ఇందులో దేవుడిగా కనిపించబోతున్నాడు. శివుడి లోని ముఖ్యమైన అంశం, కాలాంతక శివుడి గా పవన్ కళ్యాణ్ ఇందులో కనిపిస్తాడు. క్లైమాక్స్ లో ఆయన తన విశ్వరూపం ని కూడా చూపిస్తాడట. పవన్ కళ్యాణ్ ని దేవుడి గెటప్ లో ఎలా ఉంటాడో చూడాలని ఫ్యాన్స్ తో పాటుగా ఆడియన్స్ కూడా ఎదురు చూస్తున్నారు.