Rashmika Mandana – Vijay Devarakonda : టాలీవుడ్ లో ప్రేమ జంటగా సోషల్ మీడియా లో ఎల్లప్పుడూ ట్రెండింగ్ ఉంటుంది రష్మిక మరియు విజయ్ దేవరకొండ జంట. వీళ్లిద్దరు కలిసి ‘గీత గోవిందం’ మరియు ‘డియర్ కామ్రేడ్’ వంటి చిత్రాల్లో నటించారు. వీటిల్లో ‘గీత గోవిందం’ చిత్రం పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది, ‘డియర్ కామ్రేడ్’ చిత్రం కమర్షియల్ గా ఫ్లాప్ అయ్యింది కానీ, చాలామందికి ఈ సినిమా అంటే ఇష్టం,అలా మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ గా పేరు తెచ్చుకున్న ఈ ఇద్దరు గత కొంత కాలం నుండి ప్రేమించుకుంటున్నారని, ప్రస్తుతం ఇద్దరు ఒకే ఇంట్లో డేటింగ్ చేస్తున్నారని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని ఇలా పలు రకాల వార్తలు సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో ట్రెండ్ అయ్యాయి.
అయితే ఇదంతా ట్రాష్ న్యూస్ అని విజయ్ దేవరకొండ సోషల్ మీడియా లో అనేక కొట్టిపారేశాడు. కానీ వీళ్లిద్దరు కలిసి వెకేషన్స్ కి వెళ్లడం, డిన్నర్లకు వెళ్లడం, ఇలాంటివన్నీ కెమెరాలకు అడ్డం గా దొరికిపోవడం వంటివి చాలా సార్లు జరిగింది.
రీసెంట్ గా కూడా వీళ్లిద్దరు ముంబై లో ఒక రిసార్ట్ లో బాగా ఎంజాయ్ చేసి తిరిగి వస్తున్న సమయం లో విమానాశ్రయం లో కెమెరాలకు అడ్డంగా దొరికేసారు. అంతే కాదు విజయ్ దేవరకొండ ఇంట్లో ఏ ముఖ్యమైన ఫంక్షన్ జరిగిన రష్మిక మండన మాత్రం కచ్చితంగా ఉండాల్సిందే, ఇది కూడా ఎన్నోసార్లు కెమెరాలకు చిక్కిన సందర్భాలు ఉన్నాయి.
గతం లో వరుణ్ తేజ్ మరియు లావణ్య త్రిపాఠి కూడా ఇలాగే ఎన్నో సార్లు కెమెరాలకు దొరికినప్పటికీ కూడా మేము కేవలం ఫ్యామిలీ ఫ్రెండ్స్ మాత్రమే అని చెప్పుకొని కవర్ చేసుకునేవాళ్ళు. కానీ రీసెంట్ గానే వీళ్లిద్దరు నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. త్వరలోనే పెళ్లి కూడా జరగబోతుంది. సరిగ్గా ఇదే ఫార్ములా ని విజయ్ దేవరకొండ మరియు రష్మిక కూడా ఫాలో అవుతున్నారా?, వీళ్లిద్దరు ఎప్పుడు కలుస్తారో అని వాళ్ళకంటే కూడా ఫ్యాన్స్ ఎక్కువగా ఎదురు చూస్తున్నారు.