పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్యగా రేణు దేశాయ్ కి తెలుగు ప్రజల్లో మంచి గుర్తింపు ఉంది. జనసేనానితో ఆమె బంధం తెగిపోయిన తరువాత కూడా, ఆమెను తమ వదినగానే ఫీల్ అవుతూ ఉంటారు పవన్ ఫ్యాన్స్. అయితే, ప్రస్తుతం ఆమె చేస్తోన్న పని, పవన్ ఫ్యాన్స్ కి అసలు నచ్చడం లేదు. ఎందుకు రేణు దేశాయ్ ఇలా ప్రవర్తిస్తుంది ? తన సెకెండ్ ఇన్నింగ్స్ కోసం మరీ ఇలా చేయాలా ? అంటూ పవన్ ఫ్యాన్స్ తెగ ఫిల్ అయిపోతున్నారు.
ఇంతకీ ఆమె చేసిన పని ఏమిటంటే.. తానూ జడ్జ్ గా వ్యవహరిస్తోన్న షోకి పవన్ కుమార్తె ‘అధ్యా’ను తీసుకురావడం. కేవలం టీఆర్పి రేటింగ్ పెంచుకోవడానికే ఆ షో యాజమాన్యం అధ్యాని షోకు తీసుకువచ్చేలా చేశారు. మొత్తానికి రేణు దేశాయ్, పవన్ స్టార్ డమ్ ను వాడుకోవడానికి గట్టి ప్రయత్నాలే చేస్తోంది. ఇక రేణు దేశాయ్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్ గా ఉంటూ పవన్ ఫ్యాన్స్ కి తనదైన శైలిలో సమాధానం ఇస్తూ ఉంటుంది.
అన్నట్టు పవర్ ఫుల్ లేడి ఓరియంటెడ్ పాన్ ఇండియా సినిమాలో రేణు దేశాయ్ నటించబోతుంది. తన సెకెండ్ ఇన్నింగ్స్ ను గ్రాండ్ గా ప్రారంభించాలని ప్లాన్ చేసుకున్న రేణు, అన్ని చూసుకుని ఈ పాన్ ఇండియా మూవీని ఒప్పుకుంది. ఈ మూవీ పేరు ‘ఆధ్యా’. ‘హుషారు’ ఫేమ్ తేజ కురపాటి- గీతిక రతన్ యువ జంటగా నటించే ఈ ‘ఆద్య’ మూవీ షూటింగ్ కూడా ఇప్పటికే స్టార్ట్ అయింది.
మరి రేణు దేశాయ్ తన రీఎంట్రీతో పాన్ ఇండియా సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటుందా చూడాలి. మొత్తానికి మళ్లీ ఎలాగైనా సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వాలని రేణుదేశాయ్ ఎన్నాళ్లగానో పరితపిస్తోంది. మరోపక్క బుల్లితెర పై షోలలో జడ్జ్ గా కూడా అందర్నీ అలరిస్తోంది. అప్పుడప్పుడు డాక్యుమెంటరీలు కూడా చేస్తూ ఒక సినిమా కూడా డైరెక్ట్ చేయడానికి ప్లాన్ చేసుకుంది.