Director Krish Hari Hara Veeramallu : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pavan Kalyan) హీరోగా వస్తున్న హరిహర వీరమల్లు (Veeramallu) సినిమా జూన్ 12వ తేదీన రిలీజ్ అవుతుంది అంటూ భారీ ఎత్తున ప్రచారం జరిగినప్పటికి ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూస్తే ఈ సినిమా జూన్ 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలైతే లేవు… ఈ సినిమా విషయంలో డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లు అంత సాటిస్ఫైడ్ గా లేకపోవడం వల్ల ఈ సినిమాని ఎవరు కొనుగోలు చేయట్లేదు. దానివల్ల ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందనే దానిమీద సరైన క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు. మొత్తానికైతే జూన్ 12వ తేదీన ఈ సినిమా థియేటర్లకు రావడం లేదు అనేది అధికారికంగా ప్రకటించారు. కాబట్టి ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడు అనే దాని మీదనే ఇప్పుడు సర్వత్ర ఆసక్తి నెలకొంది… నిజానికి ఈ సినిమాని స్టార్ట్ చేసినప్పుడు చాలా మంచి బజ్ అయితే ఉండేది. దాదాపు నాలుగు సంవత్సరాల క్రితం ఈ సినిమాను స్టార్ట్ చేయడం ఇప్పుడు ఈ సినిమాని రిలీజ్ కి తీసుకురావడం పట్ల ప్రేక్షకుల్లో ఈ సినిమా మీద కొంత వరకు బజ్ తగ్గింది.
అలాగే డిస్టిబ్యూటర్స్, ఎగ్జిబ్యూటర్లు కూడా ఈ సినిమాని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపించడం లేదు. డైరెక్టర్ క్రిష్ (Krish) ఎప్పుడైతే ఈ సినిమాని అనౌన్స్ చేశాడో అప్పుడు అతనికి ఉన్న మార్కెట్, పవన్ కళ్యాణ్ కు ఉన్న మార్కెట్ ని బేస్ చేసుకొని ఈ సినిమా భారీ రేంజ్ లో విజయాన్ని సాధిస్తోంది. తద్వారా భారీ కలెక్షన్స్ ను కూడా కొల్లగొడుతుంది అంటూ సినిమా విమర్శకులు సైతం కామెంట్స్ అయితే చేశారు.
కానీ ఎప్పుడైతే క్రిష్ ఈ సినిమా నుంచి తప్పుకున్నాడో అప్పటి నుంచి ఈ సినిమాకి భారీ కష్టాలు అయితే ఎదురవుతున్నాయి. ఈ సినిమా మీద రోజు రోజుకి బజ్ తగ్గుతూ రావడం. అనౌన్స్ చేసిన రిలీజ్ డేట్ లు మారుస్తూ ఉండడం వల్ల ఈ సినిమా పట్ల ప్రేక్షకుడికి చాలావరకు విసుగు పుట్టింది.
Also Read : మొదలైన ‘హరి హర వీరమల్లు’ ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్..అప్పుడే అంత గ్రాస్ వచ్చిందా?
అందువల్లే ఈ సినిమా రిలీజ్ అయిన కూడా చూడడానికి ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. ఇక ఒక రకంగా క్రిష్ వల్ల కూడా ఈ సినిమాకి భారీ నష్టం అయితే వాటిల్లింది… ఈ సినిమాను ఆయన ముందుకు తీసుకెళ్తే బాగుండేది కానీ మధ్యలో ఆయన ఈ సినిమా నుంచి తప్పుకోవడం వల్ల ఈ సినిమా మీద భారీ దెబ్బ అయితే పడింది…