Pawan Kalyan World Record: తెలుగు చలన చిత్ర పరిశ్రమలో నాల్గవ స్టార్ హీరోలలో ఫ్యాన్ ఫాలోయింగ్, క్రేజ్ వంటి విషయాలను తీసుకుంటే మన అందరికీ గుర్తుకు వచ్చే పేరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan). చిరంజీవి(Megastar Chiranjeevi) తర్వాత నెంబర్ 1 స్థానం లో కూర్చున్నది ఆయనే. ఆ తర్వాత అలాగే కొనసాగించి ఉండుంటే ఈరోజు కథ వేరేలా ఉండేదేమో, కానీ ఆయన ప్రధాన ద్రుష్టి రాజకీయాల వైపు వెళ్లడం, సినిమాలు రెండవ ఛాయస్ కావడం వల్ల ఇతర హీరోలు లాగా పాన్ ఇండియన్ సినిమాలు చేయలేకపోతున్నాడు. కేవలం రీమేక్ సినిమాలు మాత్రమే చేస్తుండడం తో నేటి తరం ఆడియన్స్ కి కొన్ని ప్రాంతాల్లో ఆయన దూరమైనా విషయం వాస్తవమే. అయితే ఇప్పుడు ఆయన నటించిన సినిమాల్లో నేటి తరం యూత్ ఆడియన్స్ ఎంతో ఆతృతాతగా ఓజీ చిత్రం కోసం ఎదురు చూస్తున్నారు. గడిచిన పదేళ్లలో అభిమానుల్లో మాత్రమే కాకుండా ఇతర హీరోల అభిమానుల్లో కూడా క్రేజ్ ని పెంచుకున్న పవన్ కళ్యాణ్ సినిమా ఓజీ మాత్రమే.
Also Read: ‘వార్ 2’ క్లైమాక్స్ లో జరగబోయేది ఇదేనా..? ఆడియన్స్ కి ఊహించని ట్విస్ట్!
ఈ చిత్రం తో ఆయన పూర్వ వైభవం తిరిగి వస్తుందని అభిమానులు చాలా బలమైన నమ్మకం తో ఉన్నారు. ఇదంతా పక్కన పెడితే పవన్ కళ్యాణ్ నటించిన మొదటి 7 సినిమాలు ఒక దానిని మించి ఒకటి సూపర్ హిట్ అవుతూ రావడం మనమంతా చూశాము. మొదటి సినిమా ‘అక్కడ అమ్మాయి..ఇక్కడ అబ్బాయి’ యావరేజ్ రేంజ్ లో ఆడినప్పటికీ, ఆ తర్వాత విడుదలైన ‘గోకులం లో సీత’, ‘సుస్వాగతం’, ‘తొలిప్రేమ’, ‘తమ్ముడు’, ‘బద్రి’, ‘ఖుషి’ చిత్రాలు సంచలనాత్మక విజయాలు సాధించాయి. ఒక పక్క అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి నెంబర్ 1 స్థానం లో కొనసాగుతుంటే, తమ్ముడు అన్న ని మించిన రికార్డ్స్ ని నెలకొల్పుతూ, యూత్ ఆడియన్స్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని ఏర్పాటు చేసుకున్నాడు. అంతే కాదు ఆరోజుల్లో పవన్ కళ్యాణ్ ఒక వరల్డ్ రికార్డు ని నెలకొల్పాడు.
Also Read: ‘వార్ 2’ మూవీ యూఎస్ఏ రివ్యూ
మన ఆంధ్ర ప్రదేశ్ లో కర్నూల్ సిటీ ప్రాముఖ్యత ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కొన్ని సంవత్సరాలు ఇది మన ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ కి రాజధాని గా కూడా ఉండేది. అలాంటి కర్నూల్ సిటీ లో పవన్ కళ్యాణ్ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. మొదటి 7 సినిమాలు 105 నుండి 175 రోజులు, ప్రతీ రోజు నాలుగు ఆటలు ప్రదర్శింపబడి ఆల్ టైం రికార్డు ని నెలకొల్పింది. ఇప్పటి వరకు ఈ రికార్డు ని కర్నూల్ సిటీ లో ముట్టుకున్న హీరో నే లేరు. కేవలం టాలీవుడ్ లోనే కాదు,బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ ఇలా ఏ ఇండస్ట్రీ తీసుకున్నా ఒక సెంటర్ లో ఇలా వరుసగా 7 సినిమాలకు తిరుగులేని రికార్డు ని పెట్టిన హీరోలే లేరు. ఆ విధంగా పవన్ కళ్యాణ్ వరల్డ్ రికార్డు ని నెలకొల్పాడు.