Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నాలుగు సినిమాలు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే, అందులో ‘బ్రో ది అవతార్’ సినిమాని పూర్తి చెయ్యగా, ప్రముఖ యంగ్ డైరెక్టర్ సుజిత్ తో #OG మూవీ షూటింగ్ నాన్ స్టాప్ గా జరుగుతుంది. ఇప్పటికే పూణే మరియు ముంబై లో రెండు షెడ్యూల్స్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం, ఇప్పుడు హైదరాబాద్ లో మూడవ షెడ్యూల్ ని జరుపుకుంటుంది.
ఈ షెడ్యూల్ తర్వాత పవన్ కళ్యాణ్ ‘వారాహి’ టూర్ తో బిజీ కాబోతున్నాడు. అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేస్తున్న సినిమాలలో విపరీతమైన అంచనాలు ఉన్న సినిమా #OG నే. భారీ బడ్జెట్ యాక్షన్ చిత్రం గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గ్యాంగ్ స్టర్ రోలు చేస్తున్నాడు. ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో విలన్ గా నటించబోతున్నాడు.
ఇక ఈరోజు జరిగిన షెడ్యూల్ లో పవన్ కళ్యాణ్ పై గన్ ఫైరింగ్ షాట్స్ ని చిత్రీకరిస్తున్నారట. విలన్స్ పై గన్ కాల్పులు జరుపుతూ ఎంతో ఇంటెన్స్ గా సాగే ఈ పోరాట సన్నివేశం, ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ కి రోమాలు నిక్కపొడుచుకునేలా చేస్తుందట.ఇలాంటి సన్నివేశాలకు సినిమాలో కొదవే లేదని తెలుస్తుంది. డైరెక్టర్ సుజిత్ పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని అనే విషయం అందరికీ తెలిసిందే.
సినిమాల్లోకి వచ్చిందే పవన్ కళ్యాణ్ ని డైరెక్ట్ చెయ్యడానికి అని సుజిత్ ఎన్నో సందర్భాలలో తెలిపాడు కూడా, నేడు ఆయన కోరిక నెరవేరింది. ఒక వీరాభిమాని పవన్ కళ్యాణ్ ని తనకి ఇష్టమైన కోణం లో చూపిస్తే ‘గబ్బర్ సింగ్’ లాంటి సెన్సేషన్ వచ్చింది. ఇప్పుడు మరో అభిమాని పవన్ కళ్యాణ్ ని ఇప్పటి వరకు ఎవ్వరూ చూడని కోణం లో చూపించబోతున్నాడు. ఇక బాక్స్ ఆఫీస్ విద్వంసం ఏ స్థాయిలో ఉండబోతుంది అనేది తెలియాలంటే డిసెంబర్ వరకు ఆగాల్సిందే.
#OG enters the set…
An action-packed schedule is underway, filled with style, mass and energy. #FireStormIsComing #TheyCallHimOG pic.twitter.com/O7m5RdSVOC
— DVV Entertainment (@DVVMovies) June 8, 2023