https://oktelugu.com/

Pawan Kalyan – Bro Movie : బ్రో చిత్రం లో మహాశివుని రూపం లో కనిపించబోతున్న పవన్ కళ్యాణ్..?

ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కాలాంతక శివుని రూపం లో కనిపించబోతున్నాడు. కాలాంతక శివుడు అంటే మహాశివుని లోని ఒక అంశం. ఈ చిత్రం క్లైమాక్స్ లో సాయి ధరమ్ తేజ్ కి తన విశ్వరూపం చూపించే భాగంగా పవన్ కళ్యాణ్ మహా శివుడి గెటప్ లో కనిపిస్తాడట.

Written By:
  • Vicky
  • , Updated On : May 23, 2023 / 05:32 PM IST
    Follow us on

    Pawan Kalyan – Bro Movie : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గతం లో గోపాల గోపాల సినిమాలో మోడరన్ శ్రీకృష్ణుడిగా కనిపించిన సంగతి తెలిసిందే.ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పర్వాలేదు అనే రేంజ్ లో ఆడింది.ఇప్పుడు పవర్ స్టార్ మరోసారి దేవుడిగా మన ముందుకు రాబోతున్నాడు . సముద్ర ఖని దర్శకత్వం లో తెరకెక్కుతున్న ‘బ్రో’ చిత్రం లో ఆయన పాత్ర అలాగే ఉంటుంది. తమిళం లో డైరెక్ట్ ఓటీటీ విడుదలై మంచి రెస్పాన్స్ ని దక్కించుకున్న ‘వినోదయ్యా చిత్తం’ స్టోరీ లైన్ ని ఆధారంగా తీసుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

    ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి మాటలు మరియు స్క్రీన్ ప్లే అందించాడు. ఇందులో పవన్ కళ్యాణ్ తో పాటుగా ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ఆయన మార్కండేయులు అనే పాత్ర పోషిస్తున్నాడు.కాసేపటి క్రితమే ఈ చిత్రానికి సంబంధించిన సాయి ధరమ్ తేజ్ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ని విడుదల చేసారు.

    ఇది ఇలా ఉండగా ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కాలాంతక శివుని రూపం లో కనిపించబోతున్నాడు. కాలాంతక శివుడు అంటే మహాశివుని లోని ఒక అంశం. ఈ చిత్రం క్లైమాక్స్ లో సాయి ధరమ్ తేజ్ కి తన విశ్వరూపం చూపించే భాగంగా పవన్ కళ్యాణ్ మహా శివుడి గెటప్ లో కనిపిస్తాడట.

    ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియా ని ఒక రేంజ్ లో ఊపేస్తోంది. పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరో ఇలా దేవుడి లుక్ లో కనిపిస్తే ఆయన అభిమానులు థియేటర్స్ లో ఏ రేంజ్ లో సంబరాలు చేసుకుంటారో ఊహించుకోవచ్చు అని, గతం లో ‘గోపాల గోపాల’ చిత్రం లో పవన్ కళ్యాణ్ క్లైమాక్స్ లో మహావిష్ణువు రూపం లో విశ్వరూపం చూపిస్తాడు. కానీ ఆయన ముఖానికి క్లోజ్ అప్ షాట్స్ ఉండవు, కానీ బ్రో చిత్రం మహాశివుడి గెటప్ లో పవన్ కళ్యాణ్ క్లోజ్ అప్ షాట్స్ ఉంటాయట. రీసెంట్ గానే ఈ సన్నివేశాన్ని చిత్రీకరించారు.