Tollywood Box Office Clash: సినిమా ఇండస్ట్రీలో కొంతమంది హీరోల సినిమాలు ఒకేసారి బాక్సాఫీస్ దగ్గర తడబడితే ఆ సినిమాలకు వచ్చే క్రేజ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. నిజానికి ఆ రెండు సినిమాల మధ్య పోటీ వేరే రేంజ్ లో ఉంటుంది. ఇంతకీ అలాంటి ఒక ఫీట్ ని క్రియేట్ చేయగలిగే ఘట్స్ ఉన్న హీరోలు ఎవరు అంటే పవన్ కళ్యాణ్, మహేష్ బాబు కావడం విశేషం… కెరియర్ స్టార్టింగ్ లో తమ్ముడు సినిమా తో పవన్ కళ్యాణ్, రాజకుమారుడు సినిమాతో మహేష్ బాబు వచ్చారు. అప్పుడు వీళ్లిద్దరికి పెద్దగా ఇమేజ్ లేదు కాబట్టి సినిమాలైతే సక్సెస్ ఫుల్ గా నిలిచాయి. ఆ తర్వాత బద్రి, యువరాజ్ సినిమాలతో కూడా వీళ్లిద్దరూ పోటీపడ్డారు. వీళ్ళకి స్టార్ డమ్ వచ్చిన తర్వాత వీళ్ళిద్దరూ బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా పోటీ పడిన సందర్భాలైతే లేవు.
ఒకవేళ వీళ్ళిద్దరూ మంచి సినిమాలతో బాక్సాఫీస్ దగ్గరికి ఒకేసారి వచ్చినట్టయితే మాత్రం ప్రేక్షకులు ఎవరి సినిమా చూడాలి అనే అంతలా కన్ఫ్యూజ్ అయ్యే అవకాశాలైతే ఉన్నాయి. వీళ్ళిద్దరికీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా పెద్ద ఫ్యాన్ బేస్ ఉంది. ఇద్దరు తడబడితే చూడాలని చాలామంది ఆసక్తి ఎదురు చూస్తున్నారు.
కానీ అది ఇప్పటివరకు సాధ్యపడటం లేదు. ఇక ఏది ఏమైనా కూడా వీళ్లిద్దరి మధ్య చాలా మంచి స్నేహపూర్వకమైన సంబంధాలైతే ఉన్నాయి. సినిమాల పరంగా మాత్రం వీళ్ళిద్దరూ ఒకరికి ఒకరు తీవ్రమైన పోటీగా భావించుకుంటూ ఉంటారు… గతంలో చిరంజీవి, బాలయ్య బాబు సినిమాలకు ఎంతరా పోటీ అయితే ఉండేదో ఇప్పుడు పవన్ కళ్యాణ్, మహేష్ బాబు సినిమాలకు అలాంటి పోటీ వాతావరణం అయితే ఉంది. వీళ్లిద్దరు కలిసి బాక్సాఫీస్ దగ్గర దండయాత్ర చేస్తే చూడాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు.
కానీ అది ఇప్పటివరకు సాధ్యపడటం లేదు. వీళ్లిద్దరు కలిసి పోటీకి వస్తామని చెప్పిన ప్రొడ్యూసర్స్ ఒప్పుకునే పరిస్థితి కూడా లేదనే చెప్పాలి. ఇక ఫ్యూచర్ లో అయిన వీళ్లిద్దరు బాక్సాఫీస్ దగ్గర భారీ దండయాత్ర చేయడానికి సిద్ధమవుతారా? లేదా అనేది తెలియాల్సి ఉంది…
