
Vakeel Saab @ 2 years : నేటి తరం స్టార్ హీరోలలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టార్ స్టేటస్ అనితర సాధ్యమైనది అని చెప్పడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.అందుకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి, వాటిల్లో ‘వకీల్ సాబ్’ ఒకటి.ఈ సినిమా విడుదల సమయం లో రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా విలయతాండవం చేస్తుంది.ప్రతి 10 మంది లో నలుగురికి కరోనా రావడం, వాళ్ళు చనిపోవడం వంటివి జరిగాయి.
జనాలు ఇంట్లో నుండి అడుగు తీసి బయటకి కాలు పెట్టడానికి వణికిపోతున్న సమయం అది.అలాంటి సమయం లో సినిమా విడుదలైంది, విడుదలైన రోజునే ఈ చిత్రాన్ని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అడ్డుకునే ప్రయత్నం చేసింది.టికెట్ రేట్స్ తగ్గించేసింది,బెన్ఫిట్ షోస్ క్యాన్సిల్ చేసింది, ఇలా ఎన్ని విధాలుగా ఈ సినిమాని అడ్డుకోవాలో అన్నీ విధాలుగా అడ్డుకోవడానికి ప్రయత్నం చేసింది.కానీ పవర్ స్టార్ ప్రభంజనం ని మాత్రం ఆపలేకపోయింది.

మొదటి రోజు ఈ సినిమాకి బెన్ఫిట్ షోస్ లేకపోయినా కూడా ఆల్ టైం టాప్ 3 డే 1 రికార్డు వచ్చింది, ఆ తర్వాత మూడు రోజుల్లో ఈ సినిమా కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ నుండి వచ్చిన వసూళ్లు ట్రేడ్ పండితులను సైతం అవాక్కు చేసింది.ఎక్కడ చూసిన హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో కేవలం వారం రోజుల్లోనే 80 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది.ఈ సినిమా విడుదల సమయం లో ఓవర్సీస్ మరియు ఇతర రాష్ట్రాల్లో మార్కెట్ చాలా డౌన్ అయ్యింది.
దాని ప్రభావం ఈ సినిమా పై బాగా పడింది,ఇక పది రోజుల తర్వాత ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో కరోనా కేసులు ఉగ్రరూపం దాల్చడం తో ఈ సినిమా రన్ 90 కోట్ల రూపాయిల షేర్ తో ముగిసింది.థియేటర్స్ మూసేసిన కూడా ఈ సినిమా కంటెంట్ జనాలకి రీచ్ ఎలా అవ్వాలో అలా అయ్యింది.OTT లో టాలీవుడ్ హిస్టరీ లోనే అత్యధిక వ్యూస్ సాధించిన టాప్ 2 సినిమాలలో ఒకటిగా నిల్చింది.ఇక టీవీ టెలికాస్ట్ లో అత్యధిక TRP రేటింగ్స్ కూడా ఈ సినిమాకే వచ్చాయి.ఇలా ఎన్నో రికార్డ్స్ కి కేంద్ర నిలయమైన ఈ సినిమా విడుదలై నేటికీ 2 సంవత్సరాలు పూర్తయింది.