Pawan Kalyan: గత కొంత కాలం గా బాగా గమనించి చూస్తే పవన్ కళ్యాణ్ లో అనూహ్యమైన మార్పులు కనిపిస్తున్నాయి. తన హెయిర్ స్టైల్ దగ్గర నుండి , డ్రెస్సింగ్ స్టైల్ వరకు మార్చేయడం , లుక్స్ జెన్ జీ ఆడియన్స్ ని ఆకర్షించే విధంగా మైంటైన్ చేయడం, అదే విధంగా పార్టీ ని సంస్థాగతంగా డెవలప్ చేసేందుకు రూట్ లెవెల్ నుండి ప్రతీ జిల్లాకు క్యాడర్ ని ఏర్పాటు చేయడం, ఇలా ఒక్కటా రెండా, అసలు మనం చూస్తున్నది పవన్ కళ్యాణ్ నేనా అని అభిమానులు సైతం ఆశ్చయపోయే రేంజ్ లో మారిపోయారు. కేవలం డ్రెస్సింగ్ స్టైల్ , రాజకీయ పరంగా మాత్రమే కాదు , సినిమాల పరంగా కూడా ఆయనలో చాలా మార్పు వచ్చేసింది. ఒకప్పటి లాగా ఆడియన్స్ ని , ఫ్యాన్స్ ని తేలికగా తీసుకునే పరిస్థితులు ఇప్పుడు లేవు.
రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ కి సినిమాల మీద ఆసక్తి పోయింది. కేవలం డబ్బుల కోసం మాత్రమే సినిమాలు చేయడం మొదలు పెట్టారు. ఈ క్రమం లో కొన్ని డిజాస్టర్ ఫ్లాప్స్ వచ్చాయి , దీంతో మినిమం గ్యారంటీ గా ఉండడం కోసం వరుసగా రీమేక్ సినిమాలు చేయడం మొదలు పెట్టారు, అవి కొంత వరకు రీ ఎంట్రీ లో వర్కౌట్ అయ్యాయి , కానీ ఇప్పుడు రీమేక్స్ ని ఆడియన్స్ ఆదరించడం మొదలు పెట్టడం తో , పవన్ కళ్యాణ్ కి మళ్లీ ఫ్లాప్స్ ఎదురయ్యాయి. ఏళ్ళ తరబడి సెట్స్ మీద నాంచుతూ వచ్చిన హరి హర వీరమల్లు , ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాలు ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్స్ గా మిగిలాయి, కానీ జెన్ జీ ఆలోచనలతో తీసిన ‘ఓజీ’ మాత్రం సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అయ్యింది. అయితే ప్రస్తుతం రాజకీయాల్లో బిజీ అవ్వడం వల్ల భవిష్యత్తులో మళ్లీ ఆయన సినిమాలు చేస్తాడా లేదా అనే అనుమానం అందరిలో ఉండేది.
అలాంటి అనుమానాలు ఉన్న సమయం లోనే ‘ఓజీ 2’ ని సెట్స్ మీదకు తీసుకొని రాబోతున్నారు. ఇక మీదట ఆయన చేయబోయే సినిమాలు కూడా ఇదే రేంజ్ స్కేల్ లో ఉండబోతున్నాయి అట. ఒకప్పటి తో పోలిస్తే పవన్ కళ్యాణ్ లో ఇప్పుడు వచ్చిన మార్పులు ఊహాతీతం, అభిమానులకు , ప్రేక్షకులకు ఏది అయితే నచ్చుతుందో , అదే ఆయన చెయ్యాలని అనుకుంటున్నాడు , అది రాజకీయం అయినా, సినిమా అయినా, ఆయనలో ఈ రేంజ్ మార్పు రావడానికి ప్రధాన కారణం తమిళనాడు ఎన్నికల్లో గెలిచి విజయ్ సీఎం గా నిలబడడమే. తన కంటే తక్కువ క్రేజ్ , ఫాలోయింగ్ ఉన్న హీరో సరైన ప్లానింగ్ తో వెళ్లి ఏకంగా సీఎం అయిపోయాడు , మనం ఇంకా డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నాము , ఇకనైనా మార్పులు చేసుకోవాలి అనే ఆలోచన ఆయనలో బలంగా కలగడం వల్లే, అభిమానులు ఆశ్చర్యపోయేంత సర్ప్రైజ్ లు ఇస్తున్నారు ప్రతీ రోజు.
