OG Movie Update
OG Movie Update: ‘ఓజీ’ అనే పేరు ఎత్తితే చాలు పవన్ కళ్యాణ్ అభిమానుల్లో ఒక వైబ్రేషన్ వచ్చేస్తుంది. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ కనిపిస్తే సీఎం, సీఎం అని అరిచి గోల చేసే అభిమానులు, ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం హోదాలో ఎక్కడికి వెళ్లినా ఓజీ..ఓజీ అని అరుస్తూ సందడి చేస్తున్నారు. ఆ స్థాయిలో ఈ చిత్రంపై హైప్ ఏర్పడింది. పవన్ కళ్యాణ్ రీమేక్ సినిమాలకు కూడా టాలీవుడ్ లో ఒక రేంజ్ హైప్ ఉంటుంది. అలాంటిది ఆయన నేటి తరం ఆడియన్స్ కి తగ్గట్టుగా సినిమాలు చేస్తే అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో మనం ఊహించలేము. దానికి నిదర్శనమే ఓజీ. ఎప్పుడు విడుదల అవుతుందో తెలియదు కానీ, విడుదలైన రోజు మాత్రం బాక్స్ ఆఫీస్ విస్ఫోటనమే. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ అవ్వడం వల్ల కొంతకాలం ఈ సినిమా షూటింగ్స్ కి బ్రేక్ పడింది. రీసెంట్ గానే ఈ సినిమా ని హైదరాబాద్ లో ఒక భారీ ఫైట్ సీక్వెన్స్ తో మళ్ళీ ప్రారంభించారు.
వారం రోజుల పాటు సాగిన ఈ షూటింగ్ లో బైక్ రేస్ సన్నివేశాలను కూడా చిత్రీకరించారు. కానీ ఈ సన్నివేశాలన్నీ పవన్ కళ్యాణ్ లేనివే. ఆయన డూప్ తో చాలా రిస్కీ స్తంట్స్ ని పీటర్ హెయిన్స్ సారథ్యం లో డైరెక్టర్ సుజిత్ తెరకెక్కించాడని తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ జనవరి మొదటి వారం నుండి ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్నాడని టాక్. అయితే మరో చిన్న షెడ్యూల్ ని పూర్తి చేసుకునేందుకు ఓజీ టీం నేడు బ్యాంకాక్ కి వెళ్ళింది. అక్కడ డైరెక్టర్ సుజిత్ తీస్తున్న ఒక క్రేజీ షాట్ కి సంబంధించిన ఫోటోని నిర్మాతలు ట్విట్టర్ లో విడుదల చేయగా, దానికి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ బ్యాంకాక్ షెడ్యూల్ కోసం చాలా రోజుల నుండి ఎదురు చూస్తున్నారు.
సినిమాలోని అత్యంత కీలకమైన సన్నివేశాలన్నీ ఇక్కడే చిత్రీకరిస్తారట. భారీ యాక్షన్ సన్నివేశాలతో పాటు, ఛేజ్ సీక్వెన్స్ లను కూడా బ్యాంకాక్ లో షూట్ చేస్తారని తెలుస్తుంది. ఈ నెలాఖరున పవన్ కళ్యాణ్ కూడా బ్యాంకాక్ కి పయనం అవుతాడని, అక్కడ పది రోజుల పాటు షూట్ చేయబోయే షెడ్యూల్ లో పాల్గొంటాడని తెలుస్తుంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ‘హరి హర వీరమల్లు’ మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఈరోజు నుండి 22 వ తారీఖు వరకు పవన్ కళ్యాణ్ ఈ సినిమా షూటింగ్ లోనే పాల్గొనబోతున్నాడు. 22 వ తారీఖుతో ఈ చిత్రం మొత్తం పూర్తి అవుతుందట. మార్చి 28 వ తారీఖున ఈ చిత్రాన్ని విడుదల చేసే ప్లాన్ లో ఉన్నారు మేకర్స్. అదే తేదీ కోసం ఓజీ నిర్మాతలు కూడా పట్టుబడుతున్నారు. ఆరోజున ఈ రెండు సినిమాల్లో కచ్చితంగా ఎదో ఒకటి వస్తుంది కానీ, ఏ సినిమా వస్తుంది అనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు.