Pushpa 2
Pushpa 2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2 : ది రూల్’ చిత్రం దేశవ్యాప్తంగా సృష్టిస్తున్న ప్రభంజనం ని చూసి బాలీవుడ్ ట్రేడ్ పండితులు మొత్తం ఈ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. ఆడియన్స్ అల్లు అర్జున్ అద్భుతమైన నటనకు నీరాజనాలు పలుకుతూ సోషల్ మీడియా లో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే అల్లు అర్జున్ థియేటర్స్ కి వచ్చిన ఆడియన్స్ ని తన నటనతో ఒక ట్రాన్స్ లోకి తీసుకెళ్లిపోయారు అనే చెప్పాలి. చూసిన వాళ్ళే ఈ చిత్రాన్ని మళ్ళీ మళ్ళీ చూస్తున్నారు. విడుదలైన 5 రోజుల్లోనే 900 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టిందంటే ఈ చిత్రం ఆడియన్స్ కి ఏ రేంజ్ లో కనెక్ట్ అయ్యిందో మీరే ఊహించుకోండి. వర్కింగ్ డే లో కూడా ఈ చిత్రానికి అన్ని ప్రాంతాల్లోనూ హౌస్ ఫుల్ బోర్డ్స్ పడుతున్నాయి. బాహుబలి 2 తర్వాత ఆ స్థాయి హిస్టారికల్ ప్రభంజనంని మూవీ లవర్స్ పుష్ప 2 కి చూస్తున్నారు.
ఇంతటి ప్రభంజనం సృష్టిస్తున్న ఈ చిత్రం గురించి టాలీవుడ్ సెలెబ్రిటీలు ఒక్కరు కూడా సోషల్ మీడియా లో స్పందించకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అంటే ఇప్పటి వరకు ఈ చిత్రాన్ని ఎవ్వరూ చూడలేదా?, చూసి కూడా స్పందించడం ఎందుకులే అని మౌనం వహిస్తున్నారా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా మెగా ఫ్యామిలీ నుండి ఒక్కరు కూడా ఈ చిత్రం గురించి ఇప్పటి వరకు స్పందించలేదు. ‘దేవర’ చిత్రం విడుదలకు ముందు రోజు ఎన్టీఆర్ శుభాకాంక్షలు తెలియచేస్తూ ట్వీట్లు వేసిన రామ్ చరణ్, ‘పుష్ప 2’ చిత్రాన్ని మాత్రం అసలు పట్టించుకోలేదు. అదే విధంగా తెలుగు సినిమా గర్వించే స్థాయిలో మన హీరోలు ఏదైనా సాధిస్తే , నిండు మనసుతో మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలిచేసే గొప్ప మనసున్న మెగాస్టార్ చిరంజీవి కూడా మౌనం వహించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది.
అదే విధంగా విడుదలయ్యే ప్రతీ సినిమాని మిస్ కాకుండా చూసి, తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా అభిప్రాయాలను వ్యక్త పరిచే సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా మౌనంగా ఉన్నాడు. జర్మనీ లో ఆయనకు ‘పుష్ప 2’ మేకర్స్ ప్రత్యేకంగా స్క్రీనింగ్ వేసి చూపించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఇప్పటి వరకు ఆయన స్పందించలేదు. ‘పుష్ప’ చిత్రం విడుదలైనప్పుడు టాలీవుడ్ సెలబ్రిటీస్ మొత్తం స్పందించి అల్లు అర్జున్ నటన గురించి ఏ రేంజ్ లో అయితే పొగిడారో,ఇప్పుడు అది జరగడం లేదు. అంటే అల్లు అర్జున్ ఎదుగుదల వీళ్లకు జీర్ణించుకోవడం కష్టం గా ఉందా?, లేకపోతే వారం రోజుల్లో వెయ్యి కోట్ల గ్రాస్ ని కొట్టడం ఏంటి అనే షాక్ లోనే ఇంకా అందరూ ఉండిపోయారా అని సోషల్ మీడియా లో అల్లు అర్జున్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.